త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ‌స్ట్ స్పీచ్ – ఎమోష‌న‌ల్ అయిన త్రిష‌

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ఆదివారం ద‌ళ‌ప‌తి విజ‌య్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. విజ‌య్ ప్ర‌మాణ స్వీకార వేడుక‌కు చెన్నై క్వీన్ త్రిష అటెండ్ అయ్యింది. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం విజ‌య్ ఫ‌స్ట్ స్పీచ్ ఇచ్చారు. విజ‌య్ స్పీచ్‌కు త్రిష ఎమోష‌న‌ల్ అయ్యింది.

N

Entertainment | Published On May 10, 2026, 7.02 pm IST

Trisha | సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ‌స్ట్ స్పీచ్ – ఎమోష‌న‌ల్ అయిన త్రిష‌
Advertisement

Trisha | త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా టీవీకే పార్టీ అధినేత, స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత త‌ర్వాత త‌మిళ‌నాడు సీఎంగా ఎన్నికైన మూడో సినిమా యాక్ట‌ర్‌గా విజ‌య్ నిలిచారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌మాణ స్వీకార వేడుక చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి విజ‌య్ కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు హీరోయిన్‌ త్రిష అటెండ్ అయ్యింది. ఈ వేడుక‌కు చెన్నై క్వీన్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

మొద‌టి వ‌రుస‌లో...

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి మొద‌టి వ‌రుస‌లోనే కూర్చున్న‌ది త్రిష‌. విజ‌య్ సీఎంగా ప‌ద‌వి చేప‌డుతోన్న టైమ్‌లో త్రిష ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తెగ మురిసిపోతూ క‌నిపించింది. ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత విజ‌య్ తొలి స్పీచ్ ఇచ్చారు.

సినిమా క‌ష్టాలు...

తాను చేప‌ట్ట‌బోయే ప‌నుల‌తో పాటు త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన క‌ష్టాల గురించిఈ స్పీచ్‌లో విజ‌య్ వెల్ల‌డించారు. తాను రాయ‌ల్ ఫ్యామిలీలో పుట్ట‌లేద‌ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే ఈ స్థాయికి చేరుకున్న‌ట్లు విజ‌య్ చెప్పారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కొడుకుగా త‌న సినీ జ‌ర్నీ మొద‌లైంద‌ని, ఆక‌లి పేద‌రికం విలువ త‌న‌కు తెలుసునంటూ కెరీర్ ఆరంభంలో ఇండ‌స్ట్రీలో తాను ఎదుర్కొన్న క‌ష్టాల‌ను విజ‌య్ వివ‌రించారు.

త్రిష క‌న్నీళ్లు...

విజ‌య్ మాట‌ల‌తో త్రిష ఎమోష‌న‌ల్ అయ్యింది. క‌న్నీళ్ల‌ను దిగ‌మింగుకుంటూ క‌నిపించింది. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. అబ‌ద్ద‌పు వాగ్ధానాలు చేసి ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని తాను రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, ఇచ్చిన హామీల‌న్నీ నేర‌వేరుస్తాన‌ని, అందుకు కొంత టైమ్ కావాల‌ని విజ‌య్ అన్నారు. ప్ర‌జ‌ల‌ సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, తాను తప్పు చేయను, త‌న దగ్గర ఉన్నవారిని తప్పు చేయనివ్వన‌ని విజ‌య్ పేర్కొన్నారు. విజ‌య్ స్పీచ్ మొత్తం ఆస‌క్తిక‌రంగా విన్న‌ది త్రిష‌. చ‌ప్ప‌ట్ల‌తో ఎంక‌రేజ్ చేస్తూ క‌నిపించింది.
విజ‌య్‌, త్రిష ప్రేమ‌లో ఉన్న‌ట్లు, వారిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల న‌డుమ విజ‌య్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో త్రిష పాల్గొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు విజ‌య్ భార్య సంగీత‌తో పాటు కొడుకు, కూతురు మాత్రం ఈ వేడుక‌లో క‌నిపించ‌లేదు. వారు ఈ వేడుక‌కు దూరంగా ఉండ‌టం కూడా త‌మిళనాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
Advertisement