త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ – క‌మ‌ల్‌, ర‌జ‌నీ మ‌ల్టీస్టార‌ర్ కోసం అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?

కోలీవుడ్ అగ్ర హీరోలు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష ఫైన‌ల్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కోసం త్రిష డిమాండ్ చేసిన రెమ్యూన‌రేష‌న్ కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On May 12, 2026, 5.00 pm IST

Trisha |  త్రిష రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్ – క‌మ‌ల్‌, ర‌జ‌నీ మ‌ల్టీస్టార‌ర్ కోసం అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?
Advertisement

Trisha | త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో ప్రేమాయ‌ణం, పెళ్లి వార్త‌ల‌తో గ‌త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో త్రిష పేరు మారుమోగుతోంది. ఇటీవ‌ల ద‌ళ‌ప‌తి విజ‌య్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఈవెంట్‌కు త్రిష‌నే హైలైట్‌గా నిలిచింది. సీఎంగా బాధ‌త్య‌లు చేప‌ట్టిన అనంత‌రం విజ‌య్ స్పీచ్‌కు త్రిష ఎమోష‌న‌ల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి.

క‌రుప్పు...

మ‌రోవైపు విజ‌య్ సీఎంగా ఎన్నికైన త‌ర్వాత త‌మిళంలో రిలీజ్ కాబోతున్న మొద‌టి సినిమా కూడా త్రిష‌దే కావ‌డం గ‌మ‌నార్హం. సూర్య‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌రుప్పు మూవీ మే 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

షాకింగ్ రెమ్యూన‌రేష‌న్‌...

తాజాగా చెన్నై క్వీన్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ హీరోలుగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం డైరెక్ట‌ర్ నెల్స‌న్ త్రిష‌ను సంప్ర‌దించాడ‌ట‌. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ క‌లిసి లాంగ్ గ్యాప్ త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో త్రిష ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. కానీ రెమ్యూన‌రేష‌న్‌ను మాత్రం భారీగా డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఏకంగా 12 కోట్లు అడిగిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త్రిష రెమ్యూన‌రేష‌న్ విని మేక‌ర్స్ షాకైన‌ట్లు స‌మాచారం.

క‌రుప్పుకు ఎంతంటే?

సూర్య క‌రుప్పు మూవీ కోసం త్రిష ఐదు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. క‌మ‌ల్‌, ర‌జ‌నీ సినిమా కోసంరెమ్యూన‌రేష‌న్‌ను డ‌బుల్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క సినిమాకేనా...ఇక నుంచి అన్ని సినిమాల‌కు త్రిష ఇదే రెమ్యూన‌రేష‌న్‌ను తీసుకుంటుందా అన్ని ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గ‌తంలో క‌మ‌ల్‌హాస‌న్‌తో తూంగ‌వ‌నం, మ‌న్మ‌థ‌న్ అంబు, తో పాటు గ‌త ఏడాది రిలీజైన థ‌గ్ లైఫ్ సినిమాల్లో న‌టించింది త్రిష‌. ర‌జ‌నీకాంత్‌తో పేట సినిమా చేసింది.
దాదాపు ఏడు వంద‌ల కోట్ల‌తో క‌మ‌ల్‌, ర‌జ‌నీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవ‌లే ఓ వీడియో గ్లింప్స్‌తో ఈ మూవీని అనౌన్స్‌చేశారు. ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు.

 

Advertisement
Advertisement