త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | సూర్య సినిమాకు త్రిష సొంత గ‌ళం – ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మాతృభాష‌లో డ‌బ్బింగ్

ప‌ద‌కొండేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మాతృభాష త‌మిళంలో త‌న సొంత గొంతును వినిపించ‌బోతున్న‌ది త్రిష‌. క‌రుప్పు సినిమాలో త‌న పాత్ర‌కు తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటోంది. సూర్య హీరోగా న‌టించిన ఈ మూవీ మే 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Apr 16, 2026, 12.34 pm IST

Trisha |  సూర్య సినిమాకు త్రిష సొంత గ‌ళం – ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మాతృభాష‌లో డ‌బ్బింగ్
Advertisement

Trisha | డ‌బ్బింగ్ విష‌యంలో నేటిత‌రం హీరోయిన్ల తీరు మారుతోంది. భాష ఏదైనా మొద‌టి సినిమాకే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. కానీ సీనియ‌ర్ హీరోయిన్‌ త్రిష మాత్రం ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఇర‌వై ఏళ్లు దాటినా ఇప్ప‌టికీ అరువు గొంతుల‌పైనే ఆధార‌ప‌డుతోంది. మాతృభాష త‌మిళంలో కూడా త్రిష ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఐదారు సినిమాల‌కు మాత్ర‌మే డ‌బ్బింగ్ చెప్పింది. త్రిష‌కు ఎక్కువ‌గా చిన్మ‌యి డ‌బ్బింగ్ చెబుతుంది. తెలుగులో స‌వితా రెడ్డి గ‌ళంపై ఆధార‌ప‌డుతుంటుంది.

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత‌...

త్రిష సొంతంగా డ‌బ్బింగ్ చెప్పి చాలా ఏళ్లు అవుతోంది. చివ‌ర‌గా త‌మిళంలో తూంగ‌వ‌నం సినిమా కోసం సొంత గొంతు వినిపించింది. దాదాపు ప‌ద‌కొండేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత క‌రుప్పు సినిమాలో మ‌ళ్లీ త్రిష వాయిస్ వినిపించ‌బోతుంది. ఈ సినిమాలో త‌న పాత్ర‌కే తానే స్వ‌యంగా త్రిష డ‌బ్బింగ్ చెప్పుకుంటోంది. ద‌ర్శ‌కుడు ఆర్‌జే బాలాజీ సూచ‌న మేర‌కు త్రిష ఈ సాహ‌సానికి సిద్ధ‌ప‌డిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. త్రిష మ్యాజిక‌ల్ వాయిస్ ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. తూంగ‌వ‌నం, ఆయుథ ఎళుతు, మ‌న్మ‌ధ‌న్ అంబు, మంగాత్తా, స‌మ‌ర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు మాత్ర‌మే త్రిష సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది.

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ...

క‌రుప్పు మూవీలో సూర్య హీరోగా న‌టిస్తోన్నాడు. ఆర్‌జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా మే 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. సూర్య‌, త్రిష కాంబినేష‌న్‌లో దాదాపు 21 ఏళ్ల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి యువ‌, మౌనం పేసియాదే, ఆరు సినిమాలు చేశారు. ఇవ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ సూర్య‌, త్రిష‌ జోడీగా క‌నిపించ‌బోతుండ‌టం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాలో కామాక్షి అనే ట్రెడిష‌న‌ల్ రోల్‌లో త్రిష క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాజిటివ్ క్యారెక్ట‌ర్‌లో త్రిష క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

వీర‌భ‌ద్రుడు...

కరుప్పు మూవీ మే 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. తెలుగులో ఈ సినిమాను తొలుత క‌రుప్పు పేరుతోనే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ టైటిల్‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో వీర‌భ‌ద్రుడుగా ఛేంజ్ చేశారు. క‌రుప్పు మూవీకి సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌రుప్పుతో పాటు తెలుగులో విశ్వంభ‌ర సినిమా చేస్తోంది త్రిష‌. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఈ మూవీ జూలైలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement