త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో త్రిష – వైర‌ల్‌గా మారిన ద‌ళ‌ప‌తి విజ‌య్ సెల్యూట్‌

త‌మిళ‌నాడు ఇండిపెండెన్స్ డే సెల‌బ్రేష‌న్స్ వేడుక‌ల‌కు త్రిష స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి త్రిష పాల్గొన్న‌ది. మొద‌టి వ‌రుస‌లో కూర్చొని వేడుక‌ల‌ను తిల‌కించింది. త్రిష‌కు విజ‌య్ సెల్యూట్ చేయ‌డం ఈ వేడుక‌కు హైలైట్‌గా నిలిచింది.

N

Entertainment | Published On Aug 15, 2026, 12.16 pm IST

Trisha | ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో త్రిష – వైర‌ల్‌గా మారిన ద‌ళ‌ప‌తి విజ‌య్ సెల్యూట్‌
Advertisement

Trisha | త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో చెన్నై క్వీన్ త్రిష పాల్గొన్న‌ది. ద‌ళ‌ప‌తి విజ‌య్ నాయ‌క‌త్వంలో టీవీకే ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాతతొలి ఇండిపెండెన్స్ డే వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో సీఎం విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో పాటు త్రిష‌, ఆమె త‌ల్లి ఉమా కృష్ణ‌న్ పాల్గొన్నారు. విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి మొద‌టి వ‌రుస‌లో కూర్చొని ఈ వేడుక‌ల‌ను త్రిష తిల‌కించింది. ఇండిపెండెన్స్ డే వేడుక‌ల‌కు త్రిష స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

విజ‌య్ సెల్యూట్‌...

చారిత్ర‌క ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జ‌రిగిన ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తూ విజ‌య్ ముందుకు సాగారు. త‌న త‌ల్లిదండ్రుల‌తో పాటు త్రిష వ‌ద్ద‌కు రాగానే సెల్యూట్ చేశారు. త్రిష కూడా బ‌దులుగా విజ‌య్‌కి సెల్యూట్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రూమ‌ర్లు....

విజ‌య్ సీఎంగా ప్ర‌మాణ స్వీక‌రం చేసిన వేడుక‌కు త్రిష అటెండ్ అయ్యింది. హీరో అజిత్ త‌ల్లి చ‌నిపోవ‌డంతో అత‌డిని ప‌రామ‌ర్శించ‌డానికి త్రిష‌తో క‌లిసి ఒకే కారులో విజ‌య్ వెళ్లారు. త‌ర‌చుగా వీరిద్ద‌రు జంట‌గా క‌నిపించ‌డం, వీరిద్ద‌రి బంధంపై త‌మిళ‌నాట ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు విజ‌య్ బాట‌లోనే త్రిష కూడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే మ‌ధురైలో త్రిష అభిమానులు ఏర్పాటుచేసిన పోస్ట‌ర్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఉధ‌య‌నిధి స్టాలిన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తిప‌క్ష పార్టీలు విజ‌య్‌ని విమ‌ర్శించ‌డం కోసం త్రిష‌పై త‌ర‌చుగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

కావేరీ జ‌లాల వివాదంపై మాట్లాడుతూ త్రిష‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు ఉధ‌య‌నిధి స్టాలిన్‌. టీవీకే నాయ‌కులు ఫిర్యాదుతోపోలీసులు ఆయ‌న్ని అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement