త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tripti Dimri | ప్ర‌భాస్ స్పిరిట్ అప్‌డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న హాట్ బ్యూటీ

ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ప్ర‌భాస్ స్పిరిట్ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతుంది. ఈ వారంలోనే షూటింగ్‌లో జాయిన్ కాబోతుంది. స్పిరిట్ మూవీతోనే త్రిప్తి డిమ్రి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

N

Entertainment | Published On May 21, 2026, 5.33 pm IST

Tripti Dimri | ప్ర‌భాస్ స్పిరిట్ అప్‌డేట్ –  సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతున్న హాట్ బ్యూటీ
Advertisement

Tripti Dimri |  ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పిరిట్ కోసం రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కాబోతుంది.

త్రిప్తి డిమ్రి...

స్పిరిట్‌లో ప్ర‌భాస్‌కు జోడీగా యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ మూవీతోనే ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ మొద‌లై నాలుగైదు నెల‌లు దాటిపోయింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు త్రిప్తి డిమ్రి షూటింగ్‌లో జాయిన్ కాలేదు. ఎట్ట‌కేల‌కు ఈ ముద్దుగుమ్మ స్పిరిట్ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతుంది.

రొమాంటిక్ సీన్స్‌...

ప్ర‌స్తుతం ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా సాగుతోంది. ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై సందీప్ వంగా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మే 23 నుంచి స్పిరిట్‌ షూటింగ్‌లో త్రిప్తి డిమ్రి కూడా భాగం కానుంద‌ట‌. లాస్ట్ వీక్‌లో ప్ర‌భాస్‌, త్రిప్తి డిమ్రిల‌పై కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీక‌రించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్నార‌ట‌. వ‌చ్చే నెల ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.
స్పిరిట్‌లో ప్ర‌భాస్‌, త్రిప్తి డిమ్రి కెమిస్ట్రీ సందీప్ వంగా స్టైల్‌లోనే చాలా వైల్డ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్రిప్తి డిమ్రి క్యారెక్ట‌ర్ కూడా మ‌ల్టీపుల్ షేడ్స్‌లో సాగుతుంద‌ట‌.

ఐశ్వ‌ర్య దేశాయ్‌...

స్పిరిట్‌లో బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ వివేక్ ఒబెరాయ్, న‌టి ఐశ్వ‌ర్య దేశాయ్ విల‌న్స్‌గా క‌నిపిస్తున్నారు. స్పిరిట్ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు మూడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న టీ సిరీస్‌తో క‌లిసి సందీప్ వంగా నిర్మిస్తున్నారు. స్పిరిట్ కోసం ప్ర‌భాస్ 160 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement