త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tripti Dimri | డిజాస్ట‌ర్ల ఎఫెక్ట్ – బాలీవుడ్‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న త్రిప్తి డిమ్రి – ఫోక‌స్ మొత్తం సౌత్‌పైనే!

హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి బాలీవుడ్ సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. వ‌రుస డిజాస్ట‌ర్ల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు. హిందీ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి మ‌రో ఏడాది, రెండేళ్ల పాటు ద‌క్షిణాదిపైనే ఫోక‌స్ పెట్ట‌బోతుంద‌ట‌.

N

Entertainment | Published On Jun 30, 2026, 5.54 pm IST

Tripti Dimri | డిజాస్ట‌ర్ల ఎఫెక్ట్ – బాలీవుడ్‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న త్రిప్తి డిమ్రి –  ఫోక‌స్ మొత్తం సౌత్‌పైనే!
Advertisement

Tripti Dimri | ప్ర‌భాస్ స్పిరిట్ మూవీతో బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్ట‌బోతుంది. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో బోల్డ్ రోల్‌లో త్రిప్తి డిమ్రి క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ప్ర‌స్తుతం స్పిరిట్ షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ ఈ బ్యూటీ కెరీర్‌కు సంబంధించి ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌ని ఫిక్సైంద‌ట‌. ద‌క్షిణాది సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటుంద‌ట‌. వ‌రుస డిజాస్ట‌ర్ల ఎఫెక్ట్‌తోనే త్రిప్తి డిమ్రి ఈ డెసిష‌న్ తీసుకుంద‌ని అంటున్నారు.

యానిమ‌ల్‌తో ఫేమ‌స్‌...

శ్రీదేవి మామ్ మూవీతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది త్రిప్తి డిమ్రి. ఆ త‌ర్వాత పోస్ట‌ర్ బాయ్స్‌, లైలా మ‌జ్ను, బుల్‌బుల్‌తో పాటు మ‌రికొన్ని హిందీ సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్‌ చేసింది. ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా సందీప్ వంగా డైరెక్ష‌న్‌లో రూపొందిన యానిమ‌ల్‌తో బాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యింది. ఈ సినిమాలో గ్లామ‌ర్ రోల్‌తో యువ‌త‌రం క‌ల‌ల రాణిగా మారిపోయింది.

ఆరు సినిమాలు...

యానిమ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో త్రిప్తి డిమ్రికి బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. రెండేళ్ల గ్యాప్‌లో ఆరు సినిమాలు చేసింది. ఇందులో భూల్ భుల‌య్యా 3 మిన‌హా మిగిలిన ఐదు సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. త్రిప్తికి ఉన్న బోల్డ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన పాత్ర‌ల‌తోనే ఈ బ్యూటీని అప్రోచ్ అవుతున్నార‌ట‌. ఇప్ప‌టికే డిజాస్ట‌ర్ల‌తో యానిమ‌ల్‌తో వ‌చ్చిన క్రేజ్ మొత్తం ప‌డిపోయింది. రొటీన్ క్యారెక్ట‌ర్లు చేసి కెరీర్‌ను ఇబ్బందుల్లో పెట్ట‌డం కంటే బాలీవుడ్‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వ‌డం మంచిద‌ని అనుకుంటుంద‌ట‌. అందుకే ఇటీవ‌ల హిందీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెప్పిన కొన్ని క‌థ‌ల‌ను త్రిప్తి డిమ్రి రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

కేజీఎఫ్ హీరోతో...

బాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి ద‌క్షిణాది సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటుంద‌ట‌. ఇక్క‌డైతే ఛాలెంజింగ్ రోల్స్ వ‌రించే అవ‌కాశం ఉండ‌టంతో మ‌రో ఏడాది నుంచి రెండేళ్ల పాటు సౌత్ సినిమాలే చేయాల‌ని ప్లాన్ చేస్తుంద‌ట‌. స్పిరిట్ త‌ర్వాత త్రిప్తి డిమ్రికి బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ య‌శ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే నాని, సుజీత్ సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మ‌డి పేరు ప్ర‌చారంలో ఉంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement