Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ మా బెహెన్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హిందీ సినిమాలో త్రిప్తి డిమ్రి తల్లిగా సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కనిపించబోతుంది.
Entertainment | Published On May 15, 2026, 6.19 pm IST
Tripti Dimri | త్రిప్తి డిమ్రి పేరు చెప్పగానే ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి. రణభీర్‌కపూర్ యానిమల్‌లో త్రిప్తి డిమ్రి చేసిన ఇంటిమేట్ సీన్లు అప్పట్లో బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ప్రభాస్ స్పిరిట్‌లో గ్లామరస్ రోల్‌లోనే త్రిప్తి కనిపించబోతున్నదట.
ఇమేజ్ బ్రేక్...
తనపై ఉన్న బోల్డ్ ఇమేజ్ బ్రేక్ చేసే ప్రయత్నాల్లో ఉంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇటీవల రిలీజైన ఓ రోమియోలో గ్యాంగ్ స్టర్ భార్యగా డిఫరెంట్ రోల్ చేసింది. . అప్‌కమింగ్ మూవీ మా బెహన్‌లో డీ గ్లామర్ పాత్ర చేయబోతుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న మా బెహెన్ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం వెల్లడించారు. జూన్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మా బెహన్ స్ట్రీమింగ్ కాబోతుంది.
మాధురీ దీక్షిత్..
మా బెహెన్‌లో త్రిప్తి డిమ్రితో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ , ధరనా దుర్గా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీకి త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాధురీ దీక్షిత్ తల్లి పాత్రలో కనిపించబోతుండగా...ఆమె కూతుళ్లుగా త్రిప్తి డిమ్రి, దరనా దుర్గా నటిస్తున్నారు.
చిరంజీవి సాంగ్...
రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో టీజర్‌ను రిలీజ్ చేసింది. తల్లీకూతుళ్లు కలిసి అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేస్తారు. శవాన్ని తమ ఇంట్లోనే దాచిపెట్టడానికి ప్రయత్నించే క్రమంలో ఎదురైన సంఘటనలతో నవ్విస్తూనే థ్రిల్లింగ్‌ను పంచింది. చిరంజీవి అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ హిందీ వెర్షన్ ఈ వీడియో టీజర్‌లో వినిపించడం ఆకట్టుకుంది. ఈ బాలీవుడ్ మూవీలో రవికిషన్, గీతాంజలి కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
స్పిరిట్‌లో...
స్పిరిట్ మూవీతో త్రిప్తి డిమ్రి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది త్రిప్తి డిమ్రి. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



