Tripti Dimri | బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్‌లో వివాదం – సినిమా రిలీజ్ అంటేనే భయమేస్తుందంటూ త్రిప్తి డిమ్రి కామెంట్స్
బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి వివాదంలో చిక్కుకుంది. మా బెహన్ మూవీ ప్రమోషన్స్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధర్నా దుర్గాపై వివక్ష చూపుతున్నారంటూ త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్‌లపై నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 1, 2026, 3.02 pm IST
Tripti Dimri | యానిమల్ మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. రణభీర్‌కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీలో బోల్డ్ రోల్‌లో త్రిప్తి డిమ్రి కనిపించింది. పాత్ర నిడివి తక్కువే అయినా ఇంటిమేట్ సీన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. యానిమల్ బ్లాక్‌బస్టర్‌తో త్రిప్తి డిమ్రికి బాలీవుడ్‌తో పాటు దక్షిణాది నుంచి ఆఫర్లు క్యూ కడుతోన్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో....
త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మా బెహన్ జూన్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మాధురీ దీక్షిత్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధర్నా దుర్గా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ధర్నా దుర్గాపై వివక్ష...
మా బెహన్ ప్రమోషన్స్‌లో త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్‌తో పాటు ధర్నా దుర్గా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, కావాలనే ధర్నా దుర్గాపై వివక్ష చూపుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో ముగ్గురు కలిసి పాల్గొన్నారు. కానీ ఫొటోలు దిగే టైమ్‌లో ధర్నా దుర్గాను పక్కకు వెళ్లమని చెప్పారు. త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ మాత్రమే ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నారు. చిన్న ఆర్టిస్ట్‌లను చులకనగా చూడటం సరికాదంటూ త్రిప్తి డిమ్రితో పాటు మాధురీ దీక్షిత్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు మీరు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చారని ఆ విషయం మర్చిపోతే ఎలా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
భయమేస్తోంది...
ఈ వివాదంపై త్రిప్తి డిమ్రి రియాక్ట్ అయ్యింది. సినిమా కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే సంతోషం కంటే భయమే ఎక్కువగా కలుగుతోంది. ఈ సారి నన్ను ట్రోల్ చేయడానికి ఎలాంటి వివాదం క్రియేట్ చేస్తారా? అనే ఆలోచనలతోనే గడపాల్సివస్తోంది. నేనే ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. చిన్న చిన్న విషయాలను కూడా వివాదాలుగా మార్చి ఎదుటివారిని బాధపెట్టి సంతోషపడే వాళ్లు ఎక్కువైపోయారు అని అన్నది. రెండు సెకండ్ల క్లిప్పింగ్ చూసి తమను ట్రోల్ చేస్తున్నారని, ఆ వీడియో క్లిప్పింగ్ ముందు ఏం జరిగిందో చెప్పిన ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరంటూ అసహనం వ్యక్తం చేసింది త్రిప్తి డిమ్రి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీతులు చెప్పేవాళ్లు ఎక్కువైపోయారంటూ మాధురీ దీక్షిత్ కూడా ఈ వివాదంపై ఫైర్ అయ్యింది.
తల్లీకూతుళ్లుగా...
మా బెహన్ సినిమాకు సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ తల్లి పాత్రలో నటిస్తోండగా ఆమె కూతుళ్లుగా త్రిప్తి డిమ్రి, ధర్నా దుర్గా కనిపించబోతున్నారు. ఓ మర్డర్ కేసు నుంచి తల్లీకూతుళ్లు ఎలా బయటపడ్డారనే అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది.
సంబంధిత వార్తలు

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మే 31, 2026

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
మే 30, 2026

Truck rams car | షాకింగ్.. కారును ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు
మే 30, 2026
తాజావార్తలు
- ●RCB Players Net Worth 2026 | ఐపీఎల్ 2026 ఛాంపియన్స్ 'RCB' ప్లేయర్ల ఆస్తుల చిట్టా: విరాట్ కోహ్లీ సంపాదన చూస్తే షాకే!
- ●Hyderabad | పరారీలో ఉన్న నేపాలీలను అరెస్టు చేసేందుకు రంగంలోకి సిట్ బృందం..!
- ●HMWSSB | నగర ప్రజలకు శుభవార్త.. ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపు
- ●Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్రహాలు పెట్టడంలో ఆంతర్యమేంటి?: అల్లం నారాయణ
- ●Iran War | 20కిపైగా సైనిక స్థావరాలు ధ్వంసం.. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
- ●Kinetics 8K | విద్యుత్ లేకపోయినా నెట్ ఆగదు.. పోర్ట్రానిక్స్ కొత్త కినెటిక్స్ 8కె మినీ యూపీఎస్ విడుదల..

RCB Players Net Worth 2026 | ఐపీఎల్ 2026 ఛాంపియన్స్ 'RCB' ప్లేయర్ల ఆస్తుల చిట్టా: విరాట్ కోహ్లీ సంపాదన చూస్తే షాకే!

Hyderabad | పరారీలో ఉన్న నేపాలీలను అరెస్టు చేసేందుకు రంగంలోకి సిట్ బృందం..!

HMWSSB | నగర ప్రజలకు శుభవార్త.. ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగింపు

Allam Narayana | ఆంధ్రోళ్ల విగ్రహాలు పెట్టడంలో ఆంతర్యమేంటి?: అల్లం నారాయణ



