Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి
విద్యాబాలన్ అవార్డ్ విన్నింగ్ మూవీ డర్టీ పిక్చర్‌కు సీక్వెల్ రాబోతుంది. డర్టీ పిక్చర్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌లో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. నిర్మాత ఏక్తాకపూర్‌తో ఉన్న అనుబంధం కారణంగానే ఈ బోల్డ్ మూవీలో నటించడానికి త్రిప్తి డిమ్రి అంగీకరించినట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Oct 13, 2026, 4.16 pm IST
Tripti Dimri | విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ డర్టీ పిక్చర్‌కు దాదాపు పదిహేనేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. డర్టీ పిక్చర్ 2 పేరుతో ఈ సీక్వెల్‌ను రూపొందిస్తోన్నట్లు నిర్మాత ఏక్తాకపూర్ ప్రకటించింది. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ మూవీ బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డర్టీ పిక్చర్ తరహాలోనే ఓ దక్షిణాది నటి జీవితంలోని విషాద కోణాలను బోల్డ్ యాంగిల్‌లో ఆవిష్కరిస్తూ సెకండ్ పార్ట్ రూపొందుతోన్నట్లు సమాచారం. తమిళ హీరోయిన్ నిషా నూర్ కథతో డర్టీ పిక్చర్ 2 తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బోల్డ్ ఇమేజ్...
ఈ బయోపిక్‌లో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఖరారైనట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హిందీతో పాటు దక్షిణాదిలో త్రిప్తి డిమ్రికి ఉన్న బోల్డ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. ఏక్తాకపూర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సీక్వెల్‌లో నటించడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ అంగీకరించినట్లు సమాచారం.
లైలా మజ్ను...
ఏక్తా కపూర్ బ్యానర్‌లో వచ్చిన లైలా మజ్ను సినిమాతోనే త్రిప్తి డిమ్రి నట ప్రయాణం ప్రారంభమైంది. ఆడిషన్స్‌లో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఆమెను రిజెక్ట్ చేశారు. కానీ ఏక్తా కపూర్ పట్టుపట్టి త్రిప్తికి ఛాన్స్ ఇప్పించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. ఈ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కుటుంబంలో జరిగిన వేడుకలు, పార్టీల్లో త్రిప్తి డిమ్రి చాలా సార్లు కనిపించింది. ఏక్తా కపూర్‌తో ఉన్న స్నేహం కోసమే డర్టీ పిక్చర్ 2లో నటించడానికి త్రిప్తి ఒకే చెప్పిందని అంటున్నారు.
ఫస్ట్ బయోపిక్...
కెరీర్‌లో త్రిప్తి డిమ్రి అంగీకరించిన ఫస్ట్ బయోపిక్ మూవీ ఇదే కావడం గమనార్హం. డర్టీ పిక్చర్ 2లో త్రిప్తి డిమ్రితో పాటు పలువురు దక్షిణాది, బాలీవుడ్ యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రిప్తి డిమ్రి ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తోంది. ఈ యాక్షన్ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. స్పిరిట్ సినిమాకు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nusrat Bharucha | నొప్పిలోనూ నవ్వులు పూయిస్తున్న నుస్రత్ భరూచా!
అక్టోబర్ 12, 2026

Dirty Picture 2 | పదిహేనేళ్ల తర్వాత డర్టీ పిక్చర్‌కు సీక్వెల్ – స్టార్ హీరోయిన్ నుంచి వేశ్యగా మారిన నటి కథతో..
అక్టోబర్ 12, 2026

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Amit Shah BIMSTEC Meeting | ఏ దేశంపైనా దాడి చేయడం మా సిద్ధాంతం కాదు
- ●Kishan Reddy | భారత్‌లో కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడవదు
- ●ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..
- ●Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!
- ●Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Amit Shah BIMSTEC Meeting | ఏ దేశంపైనా దాడి చేయడం మా సిద్ధాంతం కాదు

Kishan Reddy | భారత్‌లో కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడవదు

ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..



