Tripti Dimri O Romeo Review | త్రిప్తి డిమ్రి ఓ రోమియో మూవీ రివ్యూ – లాజిక్‌లెస్ గ్యాంగ్‌స్టర్ లవ్‌స్టోరీ
త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ఓ రోమియో శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ బాలీవుడ్ మూవీకి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఓ రోమియో మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Feb 13, 2026, 7.21 pm IST
Tripti Dimri O Romeo Review | ప్రభాస్ స్పిరిట్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ఓ రోమియో శుక్రవారం రిలీజైంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓ రోమియో తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది.
గ్యాంగ్‌స్టర్ రివేంజ్ డ్రామా...
ముంబాయి అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఓ రోమియో సినిమాను తెరకెక్కించారు. అఫ్షాన్ (త్రిప్తి డిమ్రి) భర్త (విక్రాంత్ మాస్సే) దారుణ హత్యకు గురవుతాడు. తనకు జరిగిన అన్యాయానికి జలాల్ (అవినాష్ తివారీ) అతడి గ్యాంగ్ కారణమని అప్షాన్‌కు తెలుస్తోంది. భర్త మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి హసీన్ ఉస్తారా ( షాహిద్ కపూర్ ) సాయం కోరుతుంది. ఉస్తారా, అప్షాన్ కలిసి తమకంటే బలవంతుడైన జలాల్‌ను ఎలా ఎదుర్కొన్నారు? అప్షాన్ , ఉస్తారా మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఓ రోమియో మూవీ కథ.
సప్నా దీదీ....
జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై బుక్‌లోని సప్నా దీదీ కథ ఆధారంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సప్నా దీదీ కథను హుస్సేన్ ఉస్తారా కోణం నుంచి ఈ సినిమాలో ఆవిష్కరించారు. ట్రాజెడీ కథను కమర్షియల్ హంగులతో చెప్పాలని ప్రయత్నిచడం పూర్తిగా బెడిసికొట్టిందని చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. . 1990 దశకంలో అండర్ వరల్డ్ డాన్స్ ముంబాయిని ఎలా గడగడ లాడించారు? వారి మధ్య ఆధిపత్య ధోరణిని చూపించిన విధానంలో సహజత్వం కనిపించలేదని అంటున్నారు. ఈ సీన్లలో చాలా వరకు లాజిక్స్ మిస్సయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర....
ఉస్తారా పాత్రలో షాహిద్ కపూర్ బాడీలాంగ్వేజ్, స్వాగ్ బాగా కుదిరాయట. కానీ అతడి క్యారెక్టర్‌ను డెప్త్‌గా చూపించలేకపోపోయారని చెబుతున్నారు. . త్రిప్తి డిమ్రి గ్లామర్ రోల్‌లో కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఆకట్టుకుందని అంటున్నారు. షాహిద్, త్రిప్తి డిమ్రి మధ్య రిలేషన్‌ను ఆసక్తికరంగా చెప్పలేకపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మూడు గంటల రన్‌టైమ్....
రన్‌టైమ్ దాదాపు మూడు గంటలు (178 నిమిషాలు) ఉండటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అని నెటిజన్లు చెబుతోన్నారు. విలన్ పాత్రను జోకర్‌లా చూపించారని, విశాల్ భరద్వాజ్ సినిమాల్లో ఉండే ఎమోషన్స్, మ్యాజిక్ ఈ సినిమాలో మిస్సయ్యాయనే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఓ రోమియో బిలో యావరేజ్ సినిమా అని కామెంట్లు పెడుతున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



