త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Bhosle Telugu Songs | ఆశా భోస్లే పాడిన తెలుగు పాట‌లు ఇవే – అన్ని హిట్టే

ఆశా భోస్లే సింగ‌ర్‌గా తెలుగులోనూ ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను ఆల‌పించింది. అశ్వ‌మేథం, చంద‌మామ‌, ప‌విత్ర బంధంతో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో ఆశా భోస్లే పాడిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి.

N

Entertainment | Published On Apr 12, 2026, 2.20 pm IST

Asha Bhosle Telugu Songs | ఆశా భోస్లే పాడిన తెలుగు పాట‌లు ఇవే – అన్ని హిట్టే
Advertisement

Asha Bhosle Telugu Songs |  బాలీవుడ్ దిగ్గ‌జ గాయ‌ని ఆశా భోస్లే హిందీలోనే కాకుండా తెలుగులోనూ ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను ఆల‌పించారు. పాడింది త‌క్కువ అయినా ఒక్కో పాట ఆణిముత్యంలా నిలిచి సంగీత ప్రియుల‌ను ఓల‌లాడించాయి. ఆమె గొంతులోని వైవిధ్య‌త‌, మ్యాజిక్‌కు తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇళ‌య‌రాజా, ఏఆర్ రెహ‌మాన్‌, కీర‌వాణి వంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌తో ప‌నిచేశారు. 1981లో రిలీజైన పాలు నీళ్లు ఇది మౌన గీతం సినిమాతో ఆశా భోస్లే సింగ‌ర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత భ‌ర్త ఆర్‌డీ బ‌ర్మ‌న్ మ్యూజిక్ అందించిన చిన్ని కృష్ణుడు సినిమాలోనూ ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణంతో క‌లిసి జీవితం స‌ప్త సాగ‌రం అనే పాట‌ను ఆల‌పించారు.

అశ్వ‌మేథంలో...

బాల‌కృష్ణ హీరోగా కే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అశ్వ‌మేథం సినిమాలో ఆశా భోస్లే పాడిన రెండు పాట‌ల్లో అప్ప‌ట్లో ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచాయి. ఈ రొమాంటిక్ పాట‌లు యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఓ ప్రేమ‌తో నాలో నువ్వే ప్రేమ‌తో పాటు...సీతాకాలం ప్రేమ‌కు అనే పాట‌లు పాడింది. ఆశా భోస్లేతోనే ఈ పాట‌లు పాడించాల‌ని ముంబై నుంచి ప‌ట్టుప‌ట్టి ఆమెను ర‌ప్పించారు కీర‌వాణి.

చంద‌మామ‌లో....

ఆ త‌ర్వాత ప‌విత్ర బంధం, ఇద్ద‌రుతో పాటు చంద‌మామ సినిమాల్లో అశా భోస్లే పాడిన‌ మెలోడీ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. చంద‌మామ‌లోని నాలో ఊహ‌ల‌కు సాంగ్ తెలుగులో ఆశా భోస్లే పాడిన చివ‌రి పాట‌.

తెలుగులోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, గుజ‌రాతీ, ఒడియాతో పాటు నేపాళీ భాష‌ల్లో పాట‌లు ప‌డిన ఏకైక గాయ‌నిగా ఆశా భోస్లే నిలిచింది.

 

Advertisement
Advertisement