త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Serial Actors | మూడుముళ్ల‌తో ఒక్క‌టైన తెలుగు సీరియ‌ల్ హీరోహీరోయిన్లు

తెలుగు సీరియ‌ల్ హీరోహీరోయిన్లు య‌శ్వంత్ శౌర్య‌, అలంకృత షా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం వీరి పెళ్లి జ‌రిగింది. య‌శ్వంత్‌, అలంకృత పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

N

Entertainment | Published On May 3, 2026, 8.25 pm IST

Serial Actors | మూడుముళ్ల‌తో ఒక్క‌టైన తెలుగు సీరియ‌ల్ హీరోహీరోయిన్లు
Advertisement

Serial Actors |  తెలుగు సీరియ‌ల్ హీరోహీరోయిన్లు య‌శ్వంత్ శౌర్య‌, అలంకృత షా మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఈ బుల్లితెర జంట పెళ్లి ఆదివారం జ‌రిగింది. వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. అలంకృత షా , య‌శ్వంత్ ఇద్ద‌రూ సీరియ‌ల్స్‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. కుంకుమ‌పువ్వు సీరియ‌ల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అలంకృత షా. అర్ధాంగిలో న‌టించింది. ప్ర‌స్తుతం అలంకృత లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ల‌క్ష్మీనివాసం సీరియ‌ల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. ఇందులో గాయ‌త్రి పాత్ర‌లో న‌టిస్తోంది.

జ‌యంతో...

జ‌యం సీరియ‌ల్‌తో ఫేమ‌స్ అయ్యాడు య‌శ్వంత్ శౌర్య‌. సీరియ‌ల్స్ కంటే ముందు ప‌లు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించాడు. య‌శ్వంత్ శౌర్య‌, అలంకృత షా జ‌బ్ వీ మెట్‌, వ‌న్ డే గ‌ర్ల్‌ఫ్రెండ్‌, ల‌వ్ స్టోరీస్‌తో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో జంట‌గా న‌టించారు. వీరిద్ద‌రు చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పెద్ద‌ల అంగీకారంతో ఈ పెళ్లిపీట‌లు ఎక్కిన‌ట్లు చెబుతోన్నారు.
అలంకృత షాకు సోష‌ల్ మీడియాలో వ‌న్ మిలియ‌న్ వ‌ర‌కు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. వ‌న్ లాస్ట్ రైడ్‌, ట్రూ ల‌వ‌ర్‌తో పాటు అలంకృత న‌టించిన కొన్ని వెబ్‌సిరీస్‌లు రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.

 

Advertisement
Advertisement