త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharwanand | అచ్చ తెలంగాణ మాండ‌లికంతో భోగి పాట – క‌మ్మ‌రోళ్ల గంగగా శ‌ర్వానంద్‌

శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న భోగి మూవీ నుంచి ఏగిలివారంగ అనే పాట‌ శుక్రవారం రిలీజైంది. అచ్చ తెలంగాణ మాండ‌లికంలో సాగిన ఈ పాట యూట్యూబ్‌తో పాటు ఇత‌ర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట‌లో శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ డీ గ్లామ‌ర్ లుక్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

N

Entertainment | Published On Oct 9, 2026, 6.32 pm IST

Sharwanand |  అచ్చ తెలంగాణ మాండ‌లికంతో భోగి పాట  – క‌మ్మ‌రోళ్ల గంగగా శ‌ర్వానంద్‌
Advertisement

Sharwanand |  హీరోగా కెరీర్‌లో ఎక్కువ‌గా కామెడీ, ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లు చేసిన శ‌ర్వానంద్ భోగి మూవీతో త‌న స్టైల్ మార్చారు. ఫ‌స్ట్ టైమ్ రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌క్కుతోన్న ఈ సినిమాకు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఫోక్ స్టైల్‌లో...

‘భోగి’ మ్యూజికల్ ప్రమోషన్స్ మొద‌ల‌య్యాయి. ఈ సినిమా నుంచి ‘ఏగిలివారంగ’ అనే పాట‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు.  పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఫోక్ స్టైల్‌లో సాగిన ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌తో పాటు ఇత‌ర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఆదిలాబాద్ క‌థ‌తో...

1960 నాటి కాలానికి చెందిన‌ మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దులోని బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో ఈ పాట సాగింది. అప్పటి పల్లె జీవనాన్ని సహజంగా ఆవిష్కరిస్తూ, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, కులవృత్తులు, గ్రామస్థుల జీవితాలపై పెత్తనం చెలాయించిన స్థానిక భూస్వాముల  ధోరణిని అర్థ‌వంతంగా పాట‌లో చూపించారు. ఆస్కార్ విన్న‌ర్ చంద్రబోస్ అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ మాండలికంలోఈ పాట‌ను రాశారు. గ్రామీణ జీవ‌నం, ఆనాటి సామాజిక వ్యవస్థ, ప్రజల నిత్యజీవిత అనుభవాలను త‌న సాహిత్యంతో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఆవిష్క‌రించారు.

న‌ల్గొండ గ‌ద్ద‌ర్‌...

నల్గొండ గద్దర్ నర్సన్న గ‌ళం ఈ పాట‌కు ప్రాణం పోసింది. ప్రత్యేకమైన పల్లె గొంతుతో పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. న‌ల్గొండ గ‌ద్ద‌ర్‌తో పాటు నర్సిరెడ్డి, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ ఏగిలివారంగ పాట‌ను ఆల‌పించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

డీ గ్లామ‌ర్ లుక్‌...

ఈ పాట‌లో శ‌ర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్ డీ గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించారు. ప‌ల్లెటూరి యువ‌తీయువ‌కులుగా  వారి లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటున్నాయి. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో క‌మ్మ‌రోళ్ల గంగ అనే పాత్ర‌లో శ‌ర్వానంద్ క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర కోసం అత‌డి మేకోవ‌ర్‌, ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ సినిమాకు హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు  మేకర్స్ చెబుతోన్నారు.

డింపుల్ హ‌య‌తి...

భోగిలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు మ‌రో నాయిక‌గాడింపుల్ హయతి క‌నిపించ‌బోతుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ప‌దిహేను మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. న‌వంబ‌ర్ 12న భోగి మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement