Reba Monica John | తల్లి కాబోతున్న శ్రీవిష్ణు హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలతో గుడ్‌న్యూస్…
టాలీవుడ్ హీరోయిన్ రెబా మోనికా జాన్ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
Entertainment | Published On May 1, 2026, 2.24 pm IST
Reba Monica John | టాలీవుడ్ హీరోయిన్ రెబా మోనికా జాన్ గుడ్‌న్యూస్ వినిపించింది. తల్లికాబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మలయాళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన రెబా మోనికా జాన్ సామజవరగమనా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే మృత్యుంజయ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించింది. మ్యాడ్ స్క్వేర్‌లో స్వాతి రెడ్డి పాటలో తన స్టెప్పులతో అదరగొట్టింది ఈ బ్యూటీ.
బేబీ బంప్ ఫొటోలతో
తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రెబా మోనికా జాన్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తాను తల్లిగా ప్రమోషన్ పొందుతున్నట్లు చెప్పింది. భర్త జోమాన్ జోసెఫ్‌తో కలిసి దిగిన బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుతుంది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడని, ఇద్దరిగా ఉన్న తమ కుటుంబం ముగ్గురిగా మారబోతున్నట్లు ప్రకటించింది.
నాలుగేళ్ల తర్వాత...
బిజినెస్‌మెన్ అయిన జోమాన్ జోసెఫ్‌ను 2022లో పెళ్లి చేసుకుంది రెబా మోనికా జాన్. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. పెళ్లికి ముందు జోమన్ జోసెఫ్‌తో మూడేళ్ల పాటు ప్రేమలో ఉంది రెబా. 2021లో రెబాకు తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు జోమన్. పెద్దల అంగీకారంతో ఆ తర్వాతే ఏడాదే పెళ్లి చేసుకున్నారు.
వినీత్ శ్రీనివాసన్, నివీన్ పాల్ హీరోలుగా నటించిన మలయాళం మూవీ జాకబింతే స్వర్గరాజ్యం రెబా మోనికా జాన్ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ప్రణయం, ఫోరెన్సిక్‌తో పాటు మరికొన్ని మలయాళ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. తమిళంలో దళపతి విజయ్ బిగిల్‌లో యాసిడ్ బాధితురాలిగా అసమాన నటనతో మెప్పించింది. విజయ్ జననాయగన్‌లో రెబా మోనికా జాన్ ఓ కీలక పాత్ర పోషించింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Avika Gor | ఫారిన్లో ఇళ్లు కొన్న టాలీవుడ్ హీరోయిన్ – సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?
మే 10, 2026

Samantha Birthday Photos | సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్ …ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన సామ్
ఏప్రిల్ 28, 2026

Faria Abdullah | మెగాఫోన్ పట్టనున్న జాతిరత్నాలు హీరోయిన్…
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



