Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ – థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నిత్యా మీనన్ త్వరలోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఫ్యామిలీ థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ చేయనున్నదట. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు
Entertainment | Published On Jun 9, 2026, 5.28 pm IST
Nithya Menen | నేటితరం హీరోయిన్లు కేవలం యాక్టింగ్‌కు మాత్రమే పరిమితం కావడానికి ఇష్టపడటం లేదు. అవకాశం దొరికితే రైటర్లు , డైరెక్టర్లుగా సత్తా చాటడానికి రెడీ అంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ త్వరలోనే మెగాఫోన్ పట్టబోతుందట. ఈ విషయాన్ని తమిళ డైరెక్టర్ పాండిరాజ్ రివీల్ చేశాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ పరిమళ అండ్ కో ఇటీవల రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నిత్యా మీనన్ డైరెక్టర్ ఎంట్రీపై పాండిరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రెండు కథలు రెడీ...
నిత్యా మీనన్ డైరెక్షన్ ఎంట్రీ కోసం ఇప్పటికే రెండు కథలను సిద్ధం చేసుకుందని చెప్పాడు. నిత్యా రైటింగ్ స్కిల్స్ బాగుంటాయని, ఎలాంటి ఎమోషన్‌ను అయినా అద్భుతంగా రాయగలదని చెప్పాడు. "కెమెరా ముందే కాదు తెర వెనుక ఏం జరుగుతుందనే విషయంలో నిత్యా మీనన్‌కు చక్కటి అవగాహన ఉంది. ఆమెలో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి. డిఫరెంట్ పాయింట్‌తో రెండు కథలు సిద్ధం చేసుకుంది. దర్శకురాలిగా ఆమె పేరును స్క్రీన్‌పై త్వరలోనే చూడబోతున్నాం" అంటూ పాండిరాజ్ చెప్పాడు. అతడి కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
తానే హీరోయిన్...
డైరెక్టర్‌గా డెబ్యూ మూవీ కోసం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఓ కమర్షియల్ థ్రిల్లర్ కథను నిత్యా మీనన్ సిద్ధం చేసుకున్నదట. తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషలకు కనెక్ట్ అయ్యేలా యూనివర్సల్‌గా ఈ స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు చెబుతోన్నారు. విజయ్ సేతుపతి కథానాయకుడిగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.
పవన్ కళ్యాణ్ మూవీ...
తెలుగులో అలా మొదలైంది, ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, అ!తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది. చివరగా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చింది.
సంబంధిత వార్తలు

Sai Pallavi | సాయిపల్లవి మళ్లీ తప్పు చేస్తోందా? – మణిరత్నం సినిమా హాలీవుడ్ రీమేక్ అంటూ రూమర్లు
ఆగస్టు 1, 2026

Raashii Khanna | ధర్మన్ షూటింగ్లో రాశీఖన్నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
జులై 31, 2026

Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు – విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట
జులై 28, 2026
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
- ●Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
- ●DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ
- ●Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
- ●Revanth Reddy | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులు
- ●CWG 2026 | భారత్ మ్యాప్‌లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా

Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు

Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ

Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్



