Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
Komatireddy Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఫకీర్‌పురానికి చెందిన ముదిగొండ యాదయ్య తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా నేనున్నానంటూ ముందుకొచ్చి చేయందించారు.
- మరోసారి మానవత్వం చాటుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర.న్యూస్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఫకీర్‌పురానికి చెందిన ముదిగొండ యాదయ్య తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా నేనున్నానంటూ ముందుకొచ్చి చేయందించారు. అక్షరాలా రూ.18 లక్షలు ఆర్థిక సాయం అందజేసి 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టి మానవతావాదిగా ప్రశంసలు అందుకున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలోని ఫకీర్‌పురం గ్రామానికి చెందిన ముదిగొండ కృష్ణయ్య కుమారుడు యాదయ్య తీవ్ర బహుళ అవయవాల సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్నాడు. వారికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు.
బాధిత కుటుంబ సభ్యుల జీవన పరిస్థితులపై ఆరా తీసి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. క్లిష్ట సమయంలో నేనున్నానంటూ అండగా నిలిచారు. యాదయ్య వైద్యానికి అయ్యే రూ.18 లక్షల ఖర్చును ఆర్థిక సాయంగా బాధిత కుటుంబానికి అందజేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందేలా చూశారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం యాదయ్య కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టం..
రాజగోపాల్ రెడ్డి చేసిన సేవను జీవితాంతం గుర్తుంచుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు. మంచి మానవత్వం ఉన్న వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టం అంటూ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా ప్రాణాలు నిలబెడుతున్న రాజగోపాల్ రెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
- ●DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
- ●Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
- ●HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం

Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు

HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక



