త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayam Ravi | జ‌యం ర‌వి భార్య‌కు షాకిచ్చిన కోర్టు – విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊర‌ట‌

విడాకుల కేసులో కోలీవుడ్ హీరో జ‌యం ర‌వికి చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో ఊర‌ట ల‌భించింది. త‌న‌తో పాటు పిల్ల‌ల ఖ‌ర్చుల కోసం భ‌ర్త నుంచి నెల‌కు న‌ల‌భై ల‌క్ష‌లు తాత్కాలిక భ‌ర‌ణంగా ఇప్పించాలంటూ జ‌యం ర‌వి భార్య ఆర్తి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఆమె పిటిష‌న్‌ను చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు కొట్టేసింది.

N

Entertainment | Published On Jul 28, 2026, 7.16 pm IST

Jayam Ravi | జ‌యం ర‌వి భార్య‌కు షాకిచ్చిన కోర్టు – విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊర‌ట‌
Advertisement

Jayam Ravi |  భార్య ఆర్తి నుంచి విడాకులు కోరుతూ కోలీవుడ్ హీరో జ‌యం ర‌వి 2024లో కోర్టు మెట్లు ఎక్కారు. గ‌త రెండేళ్లుగా ఈ విడాకుల కేసు న‌డుస్తోంది. ఈ కేసు కోర్టులో ఉండ‌గానే భార్య ఆర్తిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జ‌యం ర‌వి. త‌న ఆస్తుల‌న్నీ లాగేసుకుంద‌ని, పిల్ల‌ల‌ను కూడా చూడ‌నివ్వ‌కుండా మాన‌సికంగా వేధింపుల‌కు గురిచేస్తుందంటూ జ‌యం ర‌వి తెలిపారు. ఇటీవ‌ల మీడియా ముందుకొచ్చిన ఆయ‌న భార్య వేధింపులు భ‌రించ‌లేక చాలా సార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. త‌న అనుమ‌తి లేకుండానే జ‌యం ర‌వి విడాకుల‌కు అప్లై చేశాన‌ని, సింగ‌ర్‌తో సంబంధం పెట్టుకొని త‌న‌ను, పిల్ల‌ల‌ను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టాడ‌ని భ‌ర్త‌ను ఉద్దేశించి ఆర్తి కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది.

నెల‌కు న‌ల‌భై ల‌క్ష‌లు...

జ‌యం ర‌వి నుంచి తాత్కాలిక భ‌రణం కోరుతూ ఇటీవ‌లే ఆర్తి కోర్టులో పిటిష‌న్ వేసింది. విడాకుల కోసం అప్ల‌య్ చేసిన‌ప్ప‌టి నుంచి జ‌యం ర‌వి త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడ‌ని, క‌నీసం పిల్ల‌ల స్కూల్ ఫీజులు కూడా క‌ట్ట‌డం లేదంటూ ఈ పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. త‌న‌కు ఇత‌ర ఆదాయ మార్గాలేవి లేవంటూ విన్న‌వించింది. త‌న ఖ‌ర్చుల‌తో పిల్ల‌ల స్కూల్ ఫీజుల కోసం నెల‌కు న‌ల‌భై ల‌క్ష‌లు తాత్కాలిక భ‌ర‌ణంగా జ‌యం ర‌వి నుంచి ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ వేసింది.

మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

నెల‌కు న‌ల‌భై ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో ఆర్తి ర‌విపై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆర్తి ర‌వి పిటిష‌న్‌ను చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు కొట్టిప‌డేసింది. ఆర్తితో పాటు జ‌యం ర‌వి కూడా త‌న వాద‌న‌ల‌ను కోర్టుకు విన్న‌వించిన‌ట్లు తెలిసింది. ఇరువురి వాద‌న‌ల‌ను విన్న కోర్టు న‌ల‌భై ల‌క్ష‌లు కాకుండా నెల‌కు మూడు ల‌క్ష‌లు భార్యా పిల్ల‌ల ఖ‌ర్చుల కోసం తాత్కాలిక భ‌ర‌ణంగా చెల్లించాల‌ని జ‌యం ర‌విని ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

2009లో పెళ్లి...

ఆర్తిని ప్రేమించిన జ‌యం ర‌వి 2009లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అర‌వ్‌, అయాన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇర‌వై ఐదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌లుకుతూ 2024లో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ప్ర‌స్తుతం త‌మిళంలో టాప్ హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు జ‌యం ర‌వి. ఐదారు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement
Advertisement