Sai Pallavi | సాయిపల్లవి మళ్లీ తప్పు చేస్తోందా? – మణిరత్నం సినిమా హాలీవుడ్ రీమేక్ అంటూ రూమర్లు
విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో ఓ రొమాంటిక్ డ్రామా మూవీతెరకెక్కుతోంది. ఇటీవలే కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కాగా మణిరత్నం మూవీ ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 1, 2026, 7.30 pm IST
Sai Pallavi | ఎక్ దిన్ మూవీతో నాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించడం, అతడి కొడుకు జునైద్ ఖాన్ హీరో కావడంతో రిలీజ్‌కు ముందు ఏక్‌దిన్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజైన మూడు రోజుల్లోనే ఈ మూవీ థియేటర్లలో కనిపించకుండాపోయింది. థాయ్ మూవీ వన్ డేకు రీమేక్‌గా ఏక్ దిన్ రూపొందింది. ఒరిజినల్‌ను మక్కీకి మక్కీగా కాపీ పేస్ట్ చేయడం, ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేశారు.
నో రీమేక్ పాలసీ...
దక్షిణాదిలో రీమేక్ సినిమాలు చేయకూడదని పాలసీ పెట్టుకున్న సాయిపల్లవి...బాలీవుడ్ కోసం ఈ రూల్‌ను పక్కనపెట్టడంపై దారుణంగా విమర్శలొచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో ఫేమస్ అయిన సాయిపల్లవి ఏక్ దిన్‌లో మాత్రం ఎలాంటి ఇంపార్టెన్స్ లేని ఓ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్ చేయడంపై ఆమెను ట్రోల్ చేశారు.
మణిరత్నం డైరెక్షన్‌లో...
ఏక్ దిన్ తర్వాత సాయిపల్లవి మరో రీమేక్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా విలక్షణ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో తమిళంలో రొమాంటిక్ డ్రామా మూవీ రాబోతుంది. ఇటీవలే కోల్‌కతాలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మణిరత్నం డైరెక్షన్‌లో సాయిపల్లవి చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. బాలీవుడ్, తమిళ సినిమాలతో సాయిపల్లవి ఫుల్ బిజీగా ఉంది. అయినా కూడా మణిరత్నంపై ఉన్న అభిమానంతో అతడి గత సినిమాల రిజల్ట్‌లను పట్టించుకోకుండా ఈ సినిమాను అంగీకరించింది. లిమిటెడ్ బడ్జెట్‌లో కేవలం నలభై రోజుల్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్లు సమాచారం.
హాలీవుడ్ రీమేక్...
ఓ హాలీవుడ్ రీమేక్‌గా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని క్రేజీ స్టుపిడ్ లవ్ ఆధారంగా విజయ్ సేతుపతి, సాయిపల్లవి మూవీ రూపొందనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విడాకులు తీసుకోవాలని అనుకున్న ఓ జంట తిరిగి తమ తప్పులను ఎలా సరిదిద్దుకున్నారు? ఒక్క రాత్రిలో వారి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనే అంశాలతో క్రేజీ స్టుపిడ్ లవ్ తెరకెక్కింది. ఆ సినిమా కథకు తమిళ నేటివిటికీ అనుగుణంగా పలు మార్పులు చేస్తూ తనదైన మ్యాజిక్‌ను జోడిస్తూ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాడని అంటున్నారు. ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నం మరోసారి రీమేక్‌తో రిస్క్ చేస్తున్నాడని నెటిజన్లు చెబుతోన్నారు. మరోసారి రీమేక్‌కు ఓకే చెప్పి సాయిపల్లవి కూడా తప్పుచేసిందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiyaan Vikram | చియాన్ విక్రమ్‌ను చిక్కుల్లో పడేసిన రీల్ – వన్య ప్రాణుల అక్రమ రవాణా ఆరోపణలు
ఆగస్టు 11, 2026

Ar Rahman Son | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఆర్ రహమాన్ కొడుకు
ఆగస్టు 10, 2026

Tabu | ఫియర్లెస్…రూత్‌లెస్…ఫస్ట్ టైమ్ మాస్ రోల్లో టబు – స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు

Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?

Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్



