త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thiruveer | నేను హీరో అంటే ఎవ‌రూ న‌మ్మ‌డంలేదు – తిరువీర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌

తాను హీరో అంటే ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని తిరువీర్ అన్నాడు. త‌న సినిమా షూటింగ్‌ల‌కు వ‌చ్చి త‌న‌నే హీరో ఎవ‌ర‌ని అడుగుతుంటార‌ని చెప్పాడు. ఇలాంటి అనుభ‌వాలు త‌న‌కు చాలా సార్లు ఎదుర‌య్యాయ‌ని పాపం ప్ర‌తాప్ టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో తిరువీర్ తెలిపాడు.

N

Entertainment | Published On Mar 26, 2026, 6.08 pm IST

Thiruveer | నేను హీరో అంటే ఎవ‌రూ న‌మ్మ‌డంలేదు – తిరువీర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌
Advertisement

Thiruveer |  తెలుగులో హీరోగా చాలా సినిమాలే చేశాన‌ని, అయినా త‌న‌ను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌డం లేద‌ని తిరువీర్ అన్నాడు. మ‌సూద సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ ఆర్టిస్ట్ త‌న‌ను డ్రైవ‌ర్‌గా పొర‌ప‌డ్డాడ‌ని ఎమోష‌న‌ల్‌గా కామెంట్స్ చేశాడు. తిరువీర్ హీరోగా న‌టించిన పాపం ప్ర‌తాప్ సినిమా సినిమా టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో తాను హీరో అంటే ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని తిరువీర్‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నేను అని చెప్పిన న‌మ్మ‌లేదు...

"ఇటీవ‌ల భ‌గ‌వంతుడు సినిమా షూటింగ్ అనంత‌ర‌పురంలో జ‌రిగింది. ఓ రోజు కో డైరెక్ట‌ర్‌తో సీన్ గురించి మాట్లాడుతుండ‌గా అక్క‌డికి ఓ వ్య‌క్తి వ‌చ్చాడు. ఎవ‌రండీ సినిమాలో హీరో అని న‌న్నే అడిగాడు. అత‌డికి ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌లేదు. ఇటీవ‌ల అమ‌లాపురంలో షూటింగ్ చేస్తుండ‌గా...సినిమాలో న‌టించ‌డానికి వ‌చ్చిన లోక‌ల్ ఆర్టిస్ట్ కూడా సినిమాలో నేనే హీరో అని ఎంత చెప్పిన న‌మ్మ‌లేదు. చివ‌ర‌కు యూనిట్ మెంబ‌ర్ వ‌చ్చి చెప్పిన త‌ర్వాతే అత‌డిలో న‌మ్మ‌కం క‌లిగింది. మ‌సూద షూటింగ్ జ‌రుగుతోండ‌గా...ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మీరు డ్రైవ‌రా అని అడిగాడు. కాదు హీరోను అంటే... నేను న‌మ్మ‌ను. హీరో అయితే కారావ్యాన్‌, మీకు గొడ‌గు ప‌ట్టుకొనే అసిస్టెంట్ ఇవ‌న్నీ ఉండాలిగా ఎందుకు లేవు అని ప్ర‌శ్నించాడు. ఇలాంటి విచిత్ర‌మైన ప‌రిస్థితులు సెట్స్‌లో త‌న‌కు ప్ర‌తిరోజు ఎదుర‌వుతూనే ఉంటాయ‌ని తిరువీర్ చెప్పాడు. ఇవ‌న్నీ తాను స్పోర్టివ్‌గా తీసుకుంటాన‌ని" పేర్కొన్నాడు.

రెండు, మూడు రోజుల‌కు మించి...

త‌న సినిమాల‌న్నీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు మూడు రోజుల‌కు మించి ఆడ‌టం లేద‌ని, ఓటీటీలో రిలీజైన త‌ర్వాత మాత్రం బాగుంటున్నాయంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నార‌ని తిరువీర్ పేర్కొన్నాడు.
అత‌డు హీరోగా న‌టించిన పాపం ప్ర‌తాప్ మూవీ ఏప్రిల్ 17న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు దుర్గ న‌రేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాయ‌ల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
ప్ర‌స్తుతం పాపం ప్ర‌తాప్‌తో పాటు భ‌గ‌వంతుడు, ఓ సుకుమారితో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తున్నాడు తిరువీర్‌. అత‌డి గ‌త సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఆడియెన్స్‌ను మెప్పించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement