త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Pothineni | హిట్టు కోసం డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ టాలీవుడ్ హీరో – కేజీఎఫ్ బ్యూటీతో రొమాన్స్‌

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తానే హీరోగా న‌టిస్తూ ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్నాడు. రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్ర‌వారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

N

Entertainment | Published On May 15, 2026, 1.34 pm IST

Ram Pothineni | హిట్టు కోసం డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ టాలీవుడ్ హీరో –  కేజీఎఫ్ బ్యూటీతో రొమాన్స్‌
Advertisement

Ram Pothineni | టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హిట్టు అందుకొని చాలా ఏళ్లు అవుతోంది. 2019లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత రామ్ హీరోగా న‌టించిన ఐదు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. హిట్టు కోసం రామ్ స్వ‌యంగా మెగాఫోన్ ప‌ట్టాడు. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తానే హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రామ్ పోతినేని ఈ సినిమా విశేషాలను అభిమానుల‌తో పంచుకున్నాడు.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. లెద‌ర్ జాకెట్ ధ‌రించి వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్ లో రామ్ కొత్తగా కనిపిస్తోన్నాడు. గ‌త సినిమాల‌కు భిన్నంగా చాలా మాసీగా ఈ క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు  పోస్ట‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.  ఇందులో  వీర అనే పాత్రలో నటిస్తున్నాడు రామ్. ఒంటరి తోడేలు క‌థ ఇది అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంటోంది.

23వ సినిమా...

రామ్ హీరోగా న‌టిస్తోన్న 23వ మూవీ ఇది. ఈ సైక‌లాజిక‌ల్‌థ్రిల్ల‌ర్ మూవీని రాపో సినిమాటిక్స్ బ్యాన‌ర్‌పై రామ్ త‌మ్ముడు కృష్ణ పోతినేని నిర్మించ‌బోతున్నారు. అనౌన్స్‌మెంట్ రోజే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. డిసెంబ‌ర్‌లో రామ్ డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

హీరోయిన్ ఎవ‌రు?

రామ్ కొత్త మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే శ్రీనిధి శెట్టి ని కలిసిన  రామ్ ఆమెకు క‌థ‌ను వినిపించార‌ట‌. కానీ డేట్స్ ఇష్యూస్ కార‌ణంగా ఈ క‌న్న‌డ బ్యూటీ ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌. ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తోన్న ఆదర్శ కుటుంబం మూవీతో శ్రీనిధి బిజీగా ఉంది. రామ్ సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు మ‌రో ఛాయిస్‌గా సంయుక్త మీన‌న్ పేరును కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని హీరోయిన్‌గా త్వ‌ర‌లోనే ఫైన‌ల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement