త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudharshan | ఆ రిస్క్ తీసుకోను – హీరో ఎంట్రీపై టాలీవుడ్ క‌మెడియ‌న్ కామెంట్స్‌

హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డంపై టాలీవుడ్ క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఇప్పుడిప్పుడే క‌మెడియ‌న్‌గా ఎదుగుతున్నాన‌ని, ఈ టైమ్‌లో హీరోగా సినిమాలు చేసి రిస్క్ తీసుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌ని అన్నాడు.

N

Entertainment | Published On Feb 22, 2026, 5.33 pm IST

Sudharshan | ఆ రిస్క్ తీసుకోను – హీరో ఎంట్రీపై టాలీవుడ్ క‌మెడియ‌న్ కామెంట్స్‌
Advertisement

Sudharshan |  హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డంపై టాలీవుడ్ క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హే బ‌ల్‌వంత్ మూవీ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. సుహాస్‌, శివానీ న‌గ‌రం హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి గోపి అచ్చ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆదివారం సుద‌ర్శ‌న్ మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్ ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు. హే బ‌ల్‌వంత్‌లో తాను చేసిన బంక‌ క్యారెక్ట‌ర్‌ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తున్నార‌ని, త‌న పంచ్‌ల‌కు హిలేరియస్‌గా నవ్వుకుంటున్నార‌ని సుద‌ర్శ‌న్ అన్నాడు. న‌టుడిగా ఈ సినిమా త‌న‌కు మంచి పేరు తీసుకొచ్చింద‌ని పేర్కొన్నాడు.

అమెరికాకు దారేది...

అమెరికాకు దారేది అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నా యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఈ షార్ట్‌ఫిల్మ్ హిట్ట‌వ్వ‌డంతో రన్‌రాజా రన్ సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ తరువాత దోచెయ్‌, కుమారి 21ఎఫ్‌, పటాస్‌, సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, నారీ నారీ నారి నడుమ మురారి, ఇప్పుడు హే బల్‌వంత్ సినిమాలు క‌మెడియ‌న్‌గా న‌న్ను టాలీవుడ్‌లో నిల‌బెట్టాయి.

హీరో ఎంట్రీ....

అనుకోకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నా. ఈ టైమ్‌లో రిస్క్‌ తీసుకోవాల‌ని అనుకోవ‌డం లేదు. నటుడిగా సెటిల్‌ అయిన త‌ర్వాతే హీరో ఎంట్రీ గురించి ఆలోచిస్తా. హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో కూడిన‌ ఓటీటీ సినిమాలు చేస్తాను. హీరోలు చేయలేని క‌థ‌లు అయ్యి ఉండాలి.

అది నిజ‌మే...

హీరోగా న‌టిస్తే క‌మెడియ‌న్‌గా అవ‌కాశాలు త‌గ్గుతాయ‌న్న‌ది నిజం. ఎందుకంటే హీరోగా న‌టించిన‌ యాక్ట‌ర్ల‌కు ఇత‌ర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఇవ్వడానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెన‌క‌డుగు వేస్తుంటారు. చిన్న పాత్రలు ఇస్తే బాగుండదని ఆలోచిస్తుంటారు. దాంతో అవకాశాలు తగ్గిపోతాయి. ఇలాంటి అపోహ‌ల వ‌ల్ల‌ తెలియకుండానే కొన్ని మంచి సినిమాల్లో చేసే అవకాశాల‌ను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

డేట్స్ క్లాష్‌...

ప్రస్తుతానికి హాస్య‌న‌టుడిగా బిజీగా ఉన్నా. డేట్స్ క్లాష్ వ‌ల్ల కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది.తమిళంలో, కన్నడంలో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మృత్యుంజయ్‌, గోదారి గ‌ట్టుమీద‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తున్నా.

Advertisement
Advertisement