త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Babu Mohan | ఆయ‌న వ‌ల్ల నేను స్టార్ కాలేదు – స‌భా మ‌ర్యాద తెలియ‌దా? – నిర్మాత సురేష్‌బాబుపై బాబు మోహ‌న్ ఆగ్ర‌హం

నిర్మాత సురేష్ బాబుపై సీనియ‌ర్ క‌మెడియ‌న్ బాబుమోహ‌న్ ఫైర్ అయ్యారు. రామానాయుడు కంటే పెద్ద ప్రొడ్యూస‌ర్ అని సురేష్‌బాబు ఫీల‌వుతున్నాడ‌ని అన్నారు. ఆయ‌న చేస్తే తాను స్టార్ కాలేదంటూ కామెంట్స్ చేశారు.

N

Entertainment | Published On Mar 26, 2026, 8.19 pm IST

Babu Mohan | ఆయ‌న వ‌ల్ల నేను స్టార్ కాలేదు – స‌భా మ‌ర్యాద తెలియ‌దా? – నిర్మాత సురేష్‌బాబుపై బాబు మోహ‌న్ ఆగ్ర‌హం
Advertisement

Babu Mohan |  అగ్ర నిర్మాత సురేష్‌బాబుపై టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, మాజీ మంత్రి బాబు మోహ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సురేష్ బాబు వ‌ల్ల తాను స్టార్ కాలేద‌ని అన్నారు. ఇటీవల చింతామ‌ణి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ వేడుక‌కు బాబుమోహ‌న్‌ను ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. . ఈ వేడుక‌లో రామానాయుడు స్టూడియో సిబ్బంది బాబుమోహ‌న్ ప‌ట్ల అమ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు స‌మాచారం. వారి ప్ర‌వ‌ర్త‌న‌తో నొచ్చుకున్న బాబుమోహ‌న్ స్టేజ్‌పైనే సురేష్‌బాబుపై ఫైర్ అయ్యారు.

స‌భా మ‌ర్యాద తెలియ‌దు...

ఇక్క‌డ పెత్త‌నం అంతా సురేష్‌బాబుదేన‌ని బాబుమోహ‌న్ అన్నారు. రామానాయుడు కంటే పెద్దవారిలా సురేష్ బాబు ఫీలవుతున్నారని అన్నాడు. "రామానాయుడు స్టూడియోకు న‌న్ను ఎప్పుడు పిల‌వ‌కండి. క‌నీసం స‌భా మ‌ర్యాద తెలియ‌దు. నేనో మాజీ మంత్రిని. స్టార్‌ను. ఆయ‌న చేస్తే నేను స్టార్ కాలేదు. సినిమా ఇండ‌స్ట్రీ న‌న్ను స్టార్‌గా నిల‌బెట్టింది. ఈ వేదిక‌పై నిల‌బ‌డ‌టానికి నేను అన‌ర్హుడిగా భావిస్తున్నా" అంటూ కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లో నుంచే బాబుమోహ‌న్ వెళ్లిపోయారు.గొడ‌వ‌కు కార‌ణ‌మేమిట‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు. బాబుమోహ‌న్ కామెంట్స్ మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

1990 దశకంలో...

1990 ద‌శ‌కంలో టాలీవుడ్‌లో అగ్ర క‌మెడియ‌న్ల‌లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్నారు బాబు మోహ‌న్‌. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. టీడీపీ, బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌ను త‌గ్గించారు. ప్ర‌స్తుతం నాని ది ప్యార‌డైజ్ సినిమాలో బాబు మోహ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.
నిర్మాత సురేష్ బాబుపై సీనియ‌ర్ క‌మెడియ‌న్ బాబుమోహ‌న్ ఫైర్ అయ్యారు. రామానాయుడు కంటే పెద్ద ప్రొడ్యూస‌ర్ అని సురేష్‌బాబు ఫీల‌వుతున్నాడ‌ని అన్నారు. ఆయ‌న చేస్తే తాను స్టార్ కాలేదంటూ కామెంట్స్ చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement