త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Poonam Kaur | వేముల‌వాడ‌లో టాలీవుడ్ హీరోయిన్ ప్ర‌త్యేక‌ పూజ‌లు

టాలీవుడ్ హీరోయిన్ పూన‌మ్ కౌర్ వేముల‌వాడ‌లో సంద‌డి చేసింది. రాజ‌రాజేశ్వ‌ర స్వామి అనుబంధ ఆల‌య‌మైన భీమేశ్వ‌ర‌స్వామిని సోమ‌వారం ద‌ర్శించుకున్న‌ది. కోడెమొక్క‌ను చెల్లించ‌డంతో పాటు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది.

N

Entertainment | Published On Apr 20, 2026, 8.18 pm IST

Poonam Kaur | వేముల‌వాడ‌లో టాలీవుడ్ హీరోయిన్ ప్ర‌త్యేక‌ పూజ‌లు
Advertisement

Poonam Kaur |  తెలంగాణ‌లోని వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వ‌ర స్వామి వారి ఆల‌యానికి సెల‌బ్రిటీలు తాకిడి పెరిగింది. ఇటీవ‌లే ఈ టెంపుల్‌ను మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ సంద‌ర్శించారు. తాజాగా వేముల‌వాడ‌లో టాలీవుడ్ హీరోయిన్ పూన‌మ్ కౌర్ సంద‌డి చేసింది. రాజ‌రాజేశ్వ‌ర స్వామి అనుబంధ ఆల‌య‌మైన భీమేశ్వ‌ర స్వామిని సోమ‌వారం ద‌ర్శించుకున్న‌ది పూన‌మ్ కౌర్‌. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు కోడెముక్కును చెల్లించుకున్నారు. పూజ‌ల అనంత‌రం స్వామి వారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను పూన‌మ్ కౌర్‌కు అర్చ‌కులు అంద‌జేశారు.

మ‌రోసారి సంద‌ర్శిస్తా...

ఈ సంద‌ర్భంగాఈ ప్ర‌జ‌లంద‌రిపై స్వామి వారి ఆశీస్సులు, క‌రుణ క‌టాక్షాలు ఉండాల‌ని పూన‌మ్ కౌర్ చెప్పారు. దేశ సంస్కృతి బాగుండాలి, ప్ర‌పంచంలో శాంతి నెల‌కొనాల‌ని ఆ దేవుడిని కోరుకున్నా. దేవాల‌య అభివృద్ధి ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత మ‌రోసారి వేముల‌వాడ‌ను సంద‌ర్శిస్తాన‌ని పూన‌మ్ కౌర్ అన్న‌ది.

మాయాజాలం సినిమాతో...

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది పూన‌మ్ కౌర్‌. శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాయాజాలం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్యం, ఈనాడు, నాగ‌వ‌ల్లి, గ‌గ‌నం, ఆడు మ‌గాడ్రా బుజ్జితో పాటు ప‌లు సినిమాలు చేసింది.

 

Advertisement
Advertisement