Tollywood | లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న టాలీవుడ్ నటుడు – ధర ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ కొత్త కారు కొన్నాడు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు ధర రెండున్నర కోట్లకుపైనే ఉంటుందట. కొత్త కారుకు పూజ చేస్తోన్న వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
Entertainment | Published On May 15, 2026, 7.35 pm IST
Tollywood | టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్ కొత్త కారు కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టాలీవుడ్‌లో రిచెస్ట్ యాక్టర్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్నారు నరేష్. తన మొత్తం ఆస్తి విలువ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నరేష్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఈ సీనియర్ నటుడి దగ్గర ఇప్పటికే కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. ఐదు కోట్ల ఖరీదైన కారావ్యాన్‌ను నరేష్ స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్నారు. మెర్సిడెజ్, రేంజ్ రోవర్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్లు కొనుగోలు చేశాడు. తాజాగా మరో లగ్జరీ కారును కొన్నాడు. పోర్షే పనామెరా టర్బో జీ 3 మోడల్‌కు చెందిన ఈ కారు విలువ రెండు కోట్ల డెబ్బై లక్షలకుపైనే ఉంటుందట.
టీనేజ్ డ్రీమ్...
పోర్షే కారుతన ఇంటికి డెలివరీ అయిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు నరేష్. పోర్షే స్పోర్ట్స్ కారు కొనాలనే టీనేజ్ ఏజ్ నాటి డ్రీమ్ ఇన్నాళ్లకు నెరవేరిందంటూ ఈ వీడియోలో పేర్కొన్నాడు. కేవలం 4. 8 సెకండ్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోవడం ఈ కారు ప్రత్యేకత అని పేర్కొన్నాడు.
బిజీయెస్ట్ కమెడియన్...
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా కొనసాగుతోన్నారు నరేష్. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఇటీవల రిలీజైన నారి నారి నడుమ మురారి, సామజవరగమనాతో మరికొన్ని సినిమాల్లో హీరో తండ్రిగా తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు.
The beautiful beast adorns my stables finally. 😄
Delighted to share the arrival of my NEW PORSCHE PANAMERA TURBO G3 SPORT into my life. 0-100km in 4.8 seconds, chrono package, burmester sound system to begin with my teenage dream to be in the world porsche club fulfilled. 😍… pic.twitter.com/VWEdzIeNwR
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) May 15, 2026
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



