Shivaji | హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ షాకింగ్ కామెంట్స్ – ఏకిపడేస్తున్న నెటిజన్లు
హీరోయిన్ల డ్రెస్‌లపై సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోయిన్ల అందం చీరలో ఉంటుంది తప్పితే సామాను కనిపించే డ్రెస్సుల్లో ఉండదంటూ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ పేర్కొన్నారు.
Entertainment | Published On Dec 23, 2025, 11.36 am IST
Shivaji | హీరోయిన్ల డ్రెస్‌లపై సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ల అందం చీరలో ఉంటుంది తప్పితే సామాను కనిపించే డ్రెస్సుల్లో ఉండదంటూ శివాజీ అన్నారు. అతడి కామెంట్స్‌ను నెటిజన్లు తప్పుపడుతున్నారు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది
చీరలోనే ...
ఈ ఈవెంట్‌లోహీరోయిన్ల డ్రెస్‌లను ఉద్దేశిస్తూ శివాజీ మాట్లాడుతూ "ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటే హీరోయిన్లు దరిద్రం అనుభవించాల్సివుంటుంది. హీరోయిన్ల అందం చీరలో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే వాటిలో ఏం ఉండదు. గ్లామర్ డ్రెస్‌లు వేసుకున్నప్పుడు అందరూ బాగున్నాయంటారు. నవ్వుతారు. కానీ లోపల మాత్రం దరిద్రపు ముం.... ఇలాంటి డ్రెస్‌లు ఎందుకు వేసుకున్నావు. మంచివి వేసుకోవచ్చుగా అని లోపల అనాలనిపిస్తుంది. కానీ అనలేం. అలా అంటే స్త్రీకి స్వేచ్ఛ స్వాతం త్య్రాలు లేవా అంటూ గొడవలు మొదలవుతాయి. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. సావిత్రి, సౌందర్య ఈ జనరేషన్‌లో రష్మిక చీరకట్టులో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టే అందరికి గుర్తుండిపోయారు. గ్లామర్ ఉండాలి. కానీ ఒక దశ వరకే పరిమితమైతే బాగుంటుంది. స్వేచ్ఛ అన్నది అదృష్టం దానిని ఎప్పుడు కోల్పోవద్దు. వేషభాషల వల్లే మన గౌరవం పెరుగుతుందన్నది అందరూ తెలుసుకోవాలి" అని శివాజీ అన్నారు.
నా మాటల గురించి ఎవరూ ఏం అనుకున్నా పోయేదం లేదని శివానీ చెప్పారు. శివాజీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
నెటిజన్ల ట్రోల్
చాలా మంది నెటిజన్లు శివాజీని ట్రోల్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ అయ్యుండి బూతులు మాట్లాడటం, హీరోయిన్ల డ్రెస్‌ల గురించి చీప్‌గా కామెంట్స్ చేయడం బాగాలేదని అంటున్నారు. శివాజీ వ్యాఖ్యలతో స్టేజ్‌పై ఉన్న హీరోయిన్లు కూడా ఇబ్బంది పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమా వేడుకలో అందరి ముందు ఇలాంటి అభ్యంతరకరమైన భాష వాడటం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ ట్రోల్స్‌పై శివాజీ ఎలా రియాక్ట్ అవుతాడన్నది చూడాల్సిందే.
90 మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్ లాంగ్ గ్యాప్ తర్వాత యాక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు శివాజీ ఈ వెబ్‌సిరీస్ హిట్టవ్వడంతో యాక్టర్‌గా మళ్లీ బిజీ అయ్యారు. ప్రస్తుతం కూర్మనాయకి, అఖిల్ అక్కినేని లెనిన్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



