Bellamkonda Sreenivas | ప్రియురాలితో టాలీవుడ్ హీరో ఎంగేజ్‌మెంట్ – పెళ్లి ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలు కావ్యతో శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. సంయుక్త మీనన్, బోయపాటి శీనుతో పాటు పలువురు హీరోయిన్లు, డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Entertainment | Published On Mar 8, 2026, 3.01 pm IST
Bellamkonda Sreenivas | టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి కబురు వినిపిస్తున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండతో పాటు అల్లు శిరీష్ ఓ ఇంటివారయ్యారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు కావ్యతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డైరెక్టర్ బోయపాటి శీను హీరోయిన్ సంయుక్త మీనన్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి పనిచేసిన పలువురు డైరెక్టర్లు, హీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రేమ వివాహం...
శ్రీనివాస్, కావ్యలది లవ్ మ్యారేజీ అని టాక్ వినిపిస్తోంది. గత రెండు, మూడేళ్లుగా కావ్యతో శ్రీనివాస్ ప్రేమలో ఉన్నాడని అంటున్నారు. పెద్దల అంగీకారంతో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. కావ్య తాత జడ్జిగా పనిచేశారని, తండ్రి ప్రస్తుతం లాయర్‌గా కొనసాగుతున్నారని అంటున్నారు.ఈ వేసవిలోనే శ్రీనివాస్, కావ్య పెళ్లి జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కిష్కిందపురితో...
గత ఏడాది రిలీజైన కిష్కిందపురితో కమర్షియల్ హిట్టు అందుకున్నాడు శ్రీనివాస్. హారర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టైసన్‌నాయుడు, హైందవతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు. నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తనయుడిగా శ్రీనివాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య ల ఎంగేజ్‌మెంట్ కి హాజరయ్యి విషెస్ చెప్పిన హీరోయిన్ సంయుక్త#BellamkondaSrinivas pic.twitter.com/nGo58bp7RL
— Sai Satish (@PROSaiSatish) March 8, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ashu Reddy | అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ ఇదే – రియల్ కాదు…రీల్ లైఫ్‌లో…
మే 9, 2026

Bellamkonda Sreenivas | బెల్లంకొండ శ్రీనివాస్ వెడ్డింగ్ రిసెప్షన్ – హాజరైన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే
మే 1, 2026

Bellamkonda Sreenivas | ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ హీరో
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



