Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం
Sai Dharam Tej | టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే పెండ్లి పీటలెక్కనున్నారు. తన స్నేహితురాలు కిరణ్‌తో (Kiran) ఆయన కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు.
Entertainment | Published On Nov 6, 2026, 7.48 am IST
Sai Dharam Tej | త్రినేత్ర న్యూస్: టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే పెండ్లి పీటలెక్కనున్నారు. తన స్నేహితురాలు కిరణ్‌తో (Kiran) ఆయన కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా వావాహ నిశ్చితార్థం (Engagement) జరిగింది. కలిసి జీవితాన్ని పంచుకోనున్న ఈ జంట ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో వీరి వివాహం జరగనుంది.
ఈ వేడుకలో చిరంజీవి (Chiranjeevi) సురేఖ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్ - నైనిక, అల్లు బాబీ దంపతులు, సోదరుడు వైష్ణవ్ తేజ్, నిహారిక, సుష్మిత, పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో పాటు కొందరు సినీ ప్రముఖులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుక జరగనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడిస్తూ, వేడుకకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సాయి ధరమ్ తేజ్-కిరణ్మయి జంటకు మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. `ప్రియమైన సాయి ధరమ్ తేజ్ - కిరణ్.. మీ జీవితంలోని ఈ అందమైన కొత్త ఆరంభానికి అభినందనలు. మీ ఇద్దరికీ అంతులేని ప్రేమ, అనుబంధం, జీవితాంతం సంతోషం లభించాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది! #KiranTejForever` అని ట్వీట్ చేశారు.
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever https://t.co/eJ7g9I5S2X— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2026
సంబంధిత వార్తలు

Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ – స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్
నవంబర్ 1, 2026

Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ – రామ్‌చరణ్ ఆర్సీ 17లో హీరోయిన్ ఫిక్స్
అక్టోబర్ 31, 2026

Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే – పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్
- ●Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు
- ●Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య
- ●Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డ్
- ●Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్
- ●Horoscope | నవంబర్ 6 రాశిఫలాలు.. మీ సేవలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది!

Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్

Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు

Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య

Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డ్



