Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు – ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్
యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదంటూ ఓ నెటిజన్ చేసిన విమర్శలపై టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ రియాక్ట్ అయ్యాడు. రవితేజ లాంటి స్టార్స్ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డారని పేర్కొన్నాడు. విమర్శలతో హీరోలను కించపరిచే బదులు వారిని ఎంకరేజ్ చేస్తూ మంచిదంటూ ఫైర్ అయ్యాడు.
Entertainment | Published On Oct 10, 2026, 3.47 pm IST
Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదంటూ టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్‌ను ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. అతడి పోస్ట్‌కు ఆది రిప్లై ఇచ్చాడు. ప్రతి నటుడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వారి జర్నీని గౌరవించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం స్మైలింగ్ ఎమోజీతో కూడిన ఓ పోస్ట్‌ను ట్విట్టర్‌లో పెట్టాడు ఆది. ఇందులో ఎలాంటి కామెంట్ పెట్టలేదు. కేవలం స్మైలింగ్ ఎమోజీలను మాత్రమే యాడ్ చేశాడు. అతడి పోస్ట్ కు రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ పెట్టాడు. "నేను చెడ్డీలు వేసుకున్నప్పట్నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు, నేను ప్యాంట్లు వేసుకుంటున్నా కానీ నువ్వు మాత్రం అక్కడే ఆగిపోయావు, నిన్న మొన్న వచ్చిన యూట్యూబర్ మౌళికి ఉన్న మార్కెట్ కూడా నీకు లేదు" అంటూ ఆదిని విమర్శించాడు.
నెటిజన్ విమర్శలు...
నెటిజనల్ విమర్శలకు ఆది సాయికుమార్ రిప్లై ఇచ్చాడు. కష్టాలు ఎదురైనంత మాత్రానా కెరీర్ ముగిసినట్లు కాదని అన్నారు. "ఇండస్ట్రీలోని ప్రతి హీరోకు వారికంటూ ఓ సొంత జర్నీతో పాటు కష్టాలు చాలానే ఉంటాయి. మా నాన్నతో రవితేజ లాంటి వారు ఈజీగా పైకి రాలేదు. అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కష్టాలు ఎదురైనంత మాత్రానా కెరీర్ ముగిసినట్లు కాదు. ప్రతి నటుడి జీవితంలో ఎ త్తుపల్లాలు సహజం. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. పోతుంటాయి. నెగెటివ్ కామెంట్లతో వారిని మరింత కిందకు లాగే బదులు ప్రోత్సహిస్తే మంచిది. ప్రతి నటుడి జర్నీని గౌరవించడం నేర్చుకొండి" అంటూ నెటిజన్‌కు బదులిచ్చాడు. ఆది సాయికుమార్ ట్వీట్ వైరల్ అవుతోంది.
శంబాల తర్వాత...
శంబాల మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా కమర్షియల్ హిట్టును అందుకున్నాడు ఆది సాయికుమార్. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇరవై ఐదు కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. శంబాల తర్వాత ఈగోరాజా, సైరాబాను సినిమాలు చేస్తోన్నాడు.
సంబంధిత వార్తలు

Catherine | నాలుగేళ్ల తర్వాత హీరోయిన్గా ఛాన్స్ – సోషియో ఫాంటసీ మూవీలో యువరాణిగా కేథరిన్
అక్టోబర్ 10, 2026

Song Lyrics | సద్ది గట్టి…సెలకల తొవ్వ బట్టి – తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ – ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో…
అక్టోబర్ 9, 2026

Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట – కమ్మరోళ్ల గంగగా శర్వానంద్
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●BC Reservations | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు ఖరారు
- ●RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో
- ●Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జనసేన మంత్రులు డుమ్మా..!
- ●Maharashtra Tapi River Incident | కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం.. నదిలో నవ దంపతుల శవాలు: అసలేం జరిగింది?
- ●India Economy | ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.3.. ఐక్యరాజ్యసమితి సంస్థ అంచనా..
- ●Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

BC Reservations | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు ఖరారు

RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో

Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జనసేన మంత్రులు డుమ్మా..!

Maharashtra Tapi River Incident | కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం.. నదిలో నవ దంపతుల శవాలు: అసలేం జరిగింది?



