OTT | దళపతి విజయ్ జీవితంపై సెటైరికల్ కామెడీ మూవీ – ఒకే రోజు నాలుగు ఓటీటీలలో రిలీజ్
తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ టీఎన్ 2026 థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 30న ఒకే రోజు నాలుగు ఓటీటీలలో రిలీజ్ అవుతోంది. దళపతి విజయ్ జీవితంపై సెటైర్లు వేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారంటూ విమర్శలు వచ్చాయి.
Entertainment | Published On Apr 28, 2026, 8.53 pm IST
OTT | ఇటీవల థియేటర్లలో రిలీజైన తమిళ మూవీ టీఎన్ 2026....దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పూఫ్‌గా తెరకెక్కించారంటూ చాలానే విమర్శలు వచ్చాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ టీవీకే నాయకులు ఆరోపించారు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో దళపతి విజయ్ ఎదుర్కొన్న సమస్యలు, కొడుకును స్టార్‌ను చేయడం కోసం విజయ్ తండ్రి ఆస్తులు అమ్ముకోవడం లాంటి సంఘటనలను కామెడీగా ఈ సినిమాలో చూపించారంటూ ఫ్యాన్ ఫైర్ అయ్యారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీతో పాటు జననాయగన్ సెన్సార్ సమస్యలపై ఇందులో సెటైర్లు వేశారంటూ ట్రోల్ చేశారు. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ టీఎన్ 2026 మూవీని అధికార డీఎమ్‌కేతో పాటు బీజేపీ పార్టీలు తెరకెక్కించాయంటూ కథనాలు వినిపించాయి..
ఇరవై రోజుల్లోనే....
టీఎన్ 2026 సినిమాను బ్యాన్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో కేసు కూడా నమోదు అయ్యింది. వివాదాలు, విమర్శల నడుమ ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన టీఎన్ 2026 మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
తాజాగా ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 30న ఒకే రోజు నాలుగు ఓటీటీలలో రిలీజ్ అవుతోంది. ఆహా తమిళ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, షార్ట్ ఫ్లిక్స్, సింప్లీ సౌత్ ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఉమాపతి రామయ్య....
టీఎన్ 2026 సినిమాలో నట్టీ సుబ్రమణియమ్, ఎం.ఎస్ భాస్కర్, తంబిరామయ్య కీలక పాత్రల్లో నటించారు. నటుడు ఉమాపతి రామయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.ఉత్తరాది నుంచి వచ్చిన ఓ సాధారణ వ్యక్తి కోలీవుడ్‌లో ఎలా స్టార్ హీరోగా ఎదిగాడు? రాజకీయాల్లోకి అడుగుపెట్టి సీఎం కావాలని కలలు కన్న అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అతడు తీసిన భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ విషయంలో ఎదురైన సమస్యలేమిటనే అంశాలతో పొలిటికల్ సెటైరికల్ కామెడీగా ఈ మూవీ రూపొందింది.
సంబంధిత వార్తలు

Comedy OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ – సినిమా మొత్తం విమానంలోనే!
మే 17, 2026

Pawan Kalyan on Vijay | తమిళనాడు పరిస్థితులు వేరు, మనవి వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీ పోలికలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మే 17, 2026

Rajinikanth | విజయ్ గెలుపుపై ఎలాంటి అసూయ లేదు – నీచపు రాజకీయాలు చేయను – రజనీకాంత్ కామెంట్స్
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



