Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? – బెనిఫిట్ షోలకు పర్మిషన్
రామ్ చరణ్ పెద్ది మూవీకి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. మల్టీప్లెక్స్‌లలో 150, సింగిల్ స్క్రీన్స్‌లో వంద రూపాయల టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిందట.
Entertainment | Published On Jun 2, 2026, 5.17 pm IST
Peddi | రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించినట్లు సమాచారం. తెలంగాణలో పెద్ది టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మల్టీప్లెక్స్‌లలో 150, సింగిల్ స్క్రీన్స్‌లో వంద రూపాయల టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందట.
బెనిఫిట్ షోలకు...
టికెట్ రేట్ల పెంపుతో పాటు ప్రీమియర్ షోస్‌కు పర్మిషన్ ఇచ్చిందట. జూన్ 3న బెనిఫిట్ షోను స్క్రీనింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఒకే షోను ప్రదర్శించేందుకు అంగీకారం తెలిపిందట. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను ఆరు వందలుగా నిర్ణయించారట.
రెండు రోజుల ముందే...
ఏపీలో రెండు రోజుల ముందే టికెట్ ధరల పెంపు జీవో జారీ అయ్యింది. తెలంగాణలో మాత్రం అనుమతులు ఆలస్యం కావడంతో టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చునని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ టైమ్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. దాంతో పెద్ది ప్రీమియర్ షోస్ కూడా పర్మిషన్ ఉండకపోవచ్చునని ప్రచారం జరిగింది. పెద్ది సినిమా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని చివరి నిమిషంలో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
జాన్వీ కపూర్...
పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా రామ్‌చరణ్ కనిపించబోతున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ – జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ
జూన్ 2, 2026

Prabhas Spirit | స్పిరిట్‌పై కొత్త అప్డేట్ – ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త
జూన్ 2, 2026

Singer Sunitha | హీరోగా సింగర్ సునీత కొడుకు – బావమరదళ్ల ప్రేమకథలో మలుపు
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Keerthy Suresh | రూటు మార్చిన మహానటి - బాలీవుడ్ మూవీలో బోల్డ్ రోల్
- ●Monsoon 2026 | గుడ్ న్యూస్: జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు!
- ●KTR | రేవంత్ రెడ్డికి రోషం లేదు.. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు : కేటీఆర్
- ●Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన
- ●Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం
- ●IT Returns | ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఫామ్ 16 తప్పనిసరిగా ఉండాలా..?

Keerthy Suresh | రూటు మార్చిన మహానటి - బాలీవుడ్ మూవీలో బోల్డ్ రోల్

Monsoon 2026 | గుడ్ న్యూస్: జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు!

KTR | రేవంత్ రెడ్డికి రోషం లేదు.. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు : కేటీఆర్

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన



