త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashii Khanna | రాశీఖ‌న్నా డ‌బ్బులు కొట్టేసిన దొంగ – షూటింగ్ సెట్స్‌లో ఘ‌ట‌న‌

ఇటీవ‌ల ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో రాశీఖ‌న్నాకు షాకింగ్ అనుభ‌వం ఎదురైన‌ట్లు చెబుతోన్నారు. రాశీ ఖ‌న్నా వ్యానిటీ వ్యాన్‌లోకి ప్ర‌వేశించిన ఓ దొంగ ఆమె డ‌బ్బులు కొట్టేయాల‌ని చూశాడ‌ట‌. ఆ దొంగ‌ను సెక్యూరిటీ సిబ్బంది ప‌ట్టుకున్నార‌ట‌.

N

Entertainment | Published On Apr 18, 2026, 5.06 pm IST

Raashii Khanna | రాశీఖ‌న్నా డ‌బ్బులు కొట్టేసిన దొంగ – షూటింగ్ సెట్స్‌లో ఘ‌ట‌న‌
Advertisement

Raashii Khanna | ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో రాశీఖ‌న్నాకు చేదు అనుభ‌వం ఎదురైంద‌ట‌. ఆమె హ్యాండ్ బ్యాగ్‌ కొట్టేసిన ఓ దొంగ అందులోని డ‌బ్బుల‌తో ప‌రార‌వ్వాల‌ని ప్ర‌య‌త్నించార‌ట. ఇటీవ‌లే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది రాశీఖ‌న్నా. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ మూవీ రాశీకి హిట్టు ఇవ్వ‌లేక‌పోయింది. ఈ డిజాస్ట‌ర్‌తో సంబంధం లేకుండా ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిలో ప‌లు సినిమాలు చేస్తోంది.

షూటింగ్ సెట్స్‌లో...

ఇటీవ‌ల ఓ సినిమా షూటింగ్‌లో రాశీఖ‌న్నాకు షాకింగ్ అనుభ‌వం ఎదురైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె డ‌బ్బులు దొంగ‌త‌నానికి గురైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది రాశీఖ‌న్నా. ఈ ఉస్తాద్ బ్యూటీ షూటింగ్‌లో ఉండ‌గా... ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ఓ అప‌రిచిత వ్య‌క్తి ప్ర‌వేశించాడ‌ట‌. రాశీ ఖ‌న్నా హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న యాభై వేల రూపాయ‌ల‌ను కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ అక్క‌డే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దొంగ‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నార‌ట‌. అత‌డిని చిత‌క‌బాది సెట్స్ నుంచి గెంటేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వ్యానిటీ వ్యాన్ సిబ్బందిలోనే ఒక‌రు చోరీకి పాల్ప‌డిన‌ట్లు చెబుతోన్నారు.

యూనిట్‌పై ఫైర్‌...

కాగా ఈ ఘట‌న‌తో రాశీఖ‌న్నా చిత్ర యూనిట్‌ఫై ఫైర్ అయిన‌ట్లు స‌మాచారం. స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించే వ‌ర‌కు షూటింగ్ చేసేది లేదంటూ సెట్స్ నుంచి వెళ్లిపోయిన‌ట్లు చెబుతున్నారు. ఈ దొంగ‌త‌నంపై మాత్రం రాశీ ఖ‌న్నా రియాక్ట్ కాలేదు. కానీ హీరోయిన్ ప‌ర్స‌న‌ల్ టీమ్ మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండించింది. దొంగ‌త‌నం జ‌రిగింది నిజ‌మే కానీ ఆ డ‌బ్బులు రాశీఖ‌న్నావి కాద‌ని, ఆమె మేనేజ‌ర్‌వ‌ని అంటున్నారు.

సంక్రాంతికి వ‌స్తున్నాం రీమేక్‌లో...

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో సంక్రాంతికి వ‌స్తున్నాం రీమేక్‌లో రాశీఖ‌న్నా న‌టిస్తోంది. తెలుగులో మీనాక్షి చౌద‌రి చేసిన క్యారెక్ట‌ర్‌లో హిందీలో రాశీఖ‌న్నా క‌నిపించ‌బోతుంది. ఫ‌ర్జీ 2 వెబ్‌సిరీస్‌తో పాటు మ‌రో వెబ్ సిరీస్ చేస్తోంది. ఇవే కాకుండా బాలీవుడ్‌లో మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Advertisement
Advertisement