త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగ‌ర్ చిన్మ‌యి – బిగ్‌బాస్ కంటే డ‌బుల్ ప్రైజ్‌మ‌నీ

బిగ్‌బాస్‌కు పోటీగా తెలుగులోకి మ‌రో కొత్త రియాలిటీ షో రాబోతుంది. ది ట్రైట‌ర్స్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ షోకు హ‌నుమాన్ హీరో తేజా స‌జ్జా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ తెలుగు షోలోకి చిన్మ‌యి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

N

Entertainment | Published On Oct 6, 2026, 5.37 pm IST

Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగ‌ర్ చిన్మ‌యి –  బిగ్‌బాస్ కంటే డ‌బుల్ ప్రైజ్‌మ‌నీ
Advertisement

Singer Chinmayi |బిగ్‌బాస్‌కు పోటీగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు మ‌రో కొత్త రియాలిటీ షో రాబోతుంది. ది ట్రైట‌ర్స్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ షోకు హ‌నుమాన్ హీరో తేజా స‌జ్జా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అక్టోబ‌ర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ది ట్రైట‌ర్స్ స్ట్రీమింగ్ కాబోతుంది.

రియాలిటీ షో...

ఈ ఓటీటీ రియాలిటీ షో ట్రైల‌ర్ మంగ‌ళ‌వారం రిలీజైంది. ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది రివీల్ చేశారు. ఈ ప్యాలెస్‌లో జ‌ర‌గ‌బోయేది ఆట కాదు...మాట‌ల మ‌ధ్య జ‌రుగ‌బోయే యుద్దం...ఇక్క‌డ వేసే ప్ర‌తి ఎత్తు వెనుక మోసం ఉంటుంది. ఈ ఆట కూడా యుద్ధం లాంటిదే అంటూ ట్రైల‌ర్‌లో తేజా స‌జ్జా చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇర‌వై మంది సెలిబ్రిటీలు..

మొత్తం ఇర‌వై మంది సెలిబ్రిటీలు ది ట్రైట‌ర్స్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన‌బోతున్న‌ట్లు తేజా స‌జ్జా వెల్ల‌డించారు. వారిని ట్రైట‌ర్స్‌, ఇన్నోసెంట్స్ అనే రెండు గ్రూపులుగా విభ‌జించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్రైజ్‌మ‌నీ...

ది ట్రైట‌ర్స్ ప్రైజ్‌మ‌నీని తేజా స‌జ్జా రివీల్ చేశాడు. విజేత‌కు కోటి రూపాయ‌లు ద‌క్కుతుంద‌ని అన్నారు. ట్రైట‌ర్స్‌, ఇన్నోసెంట్స్ గొడ‌వ‌ల‌తో ఈ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ప్ర‌తి సీన్ ప్రీ క్లైమాక్స్‌... ఎవ‌రి క్లైమాక్స్ ఎప్పుడో ఎవ‌రికి తెలియ‌దు అంటూ ట్రైల‌ర్ చివ‌ర‌లో తేజా స‌జ్జా చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. టాస్క్‌లు, కంటెస్టెంట్స్ గొడ‌వ‌లు చూస్తుంటే బిగ్‌బాస్‌కు ద‌గ్గ‌ర‌గానే ఈ షో ఉండ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

కంటెస్టెంట్స్‌...

ది ట్రైట‌ర్స్ తెలుగు షోలో పాల్గొన‌నున్న కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది రివీలైంది. వివాదాస్ప‌ద సింగ‌ర్‌ చిన్మ‌యి ఈ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది . ఆమెతో పాటు న‌టి ప్ర‌గ‌తి, క‌మెడియ‌న్ విష్ణు ఓయ్‌తో పాటు ప‌లువురు సెలిబ్రిటీలు ఈ షోలోకి కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఈ షో కోసం భారీగానే రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

'ది ట్రైటర్స్' తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్‌...

1. చిన్మయి శ్రీపాద
2. హర్షవర్ధన్
3. ప్రగతి
4. సాయి రోనక్
5. విద్యుల్లేఖ‌ రామన్
6. నిఖిల్ విజయేంద్ర సింహ
7. శ్రీదేవి చౌదరి
8. విష్ణు ఒయ్
9. శ్రావ్య వర్మ
10. వర్ష డిసౌజా
11. ఆషిక పదుకొనే
12. స్వీకర్ అగస్తి
13. డాక్టర్ మేఘనాథ్ రెడ్డి
14. మౌనీష చౌదరి
15. ప్రణవ్
16. ఎస్ఎస్ వర్ధన్
17. రాహత్ అచంట
18. గౌరవ్ సునీల్
19. పుప్పాల ధనుంజయ్
20. ఫాల్గుణి బండేరా

Advertisement
Advertisement