OTT | రెండు కోట్ల బడ్జెట్ – 155 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కన్నడ మూవీ ప్రేమదా ఊరళి 155 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కన్నడ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Nov 17, 2026, 2.05 pm IST
OTT | కన్నడంలో చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది ప్రేమదా ఊరలి మూవీ. పేరున్న స్టార్లు, భారీ బడ్జెట్ హంగులు లేకుండా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 155 కోట్లకుపైగా కలెక్షన్లను దక్కించుకుంది. కన్నడంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ప్రేమదా ఊరలి సినిమాలో శ్రీరామ్, తపస్విని పూనాచా హీరోహీరోయిన్లుగా నటించారు. రమిక శివు, రంగాయన రఘు కీలక పాత్రలు పోషించారు. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు.
అమెజాన్ ప్రైమ్...
ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజైంది.
తెలుగులో డిజాస్టర్...
ప్రేమదా ఊరలి సినిమాను తొలుత ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. తొలి రోజు కేవలం 12 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. మౌత్‌టాక్ బాగుండటంతో రెండోవారం నుంచి వసూళ్లు పెరిగాయి. ఈ ఏడాది కన్నడంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రేమదా ఊరలి మూవీ ప్రేమనే ఊరిలో పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. కన్నడంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
తండ్రీకొడుకుల అనుబంధం...
తండ్రీకొడుకుల అనుబంధంతో దర్శకుడు మనోజ్‌కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యమిస్తూ ఈ సినిమాను రూపొందించిన తీరు బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి.
సంతోష్ లవ్‌స్టోరీ...
నాగన్న ఓ రైతు. భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకు సంతోష్‌ను అల్లారుముద్దుగా పెంచుతాడు. సంతోష్‌ను మరదలు వసంత ప్రేమిస్తుంటుంటుంది. కానీ మరదలిని కాదని రుక్మిణి అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు సంతోష్. వసంత, సంతోష్ ప్రేమ విషయం తెలిసి రుక్మిణి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఇద్దరిలో అసలు సంతోష్ ఎవరిని ఇష్టపడ్డాడు? కొడుకు దగ్గర నాగన్న దాచిన నిజం ఏమిటి అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ananya Panday | సినిమా ఛాన్స్‌లు నిల్ – లైగర్ హీరోయిన్ ఆశలన్నీ కరణ్ జోహార్ వెబ్‌సిరీస్ పైనే!
నవంబర్ 17, 2026

Bollywood | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన అలియాస్ రుక్మిణి హీరోయిన్ బాలీవుడ్ మూవీ
నవంబర్ 13, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ రెండు బ్లాక్‌బస్టర్స్ మిస్సవ్వొద్దు
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



