త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | నీట్ పేప‌ర్ లీక్‌పై వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

నీట్ పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌ల‌పై ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. ది స్కామ్ లీక్‌డ్ పేరుతో రూపొందిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. నీట్ పేప‌ర్ లీక్ సంఘ‌ట‌న‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ సిరీస్‌లో చూపించారు.

N

Entertainment | Published On Jul 24, 2026, 4.11 pm IST

Web Series | నీట్ పేప‌ర్ లీక్‌పై వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
Advertisement

Web Series |  నీట్ పేప‌ర్ లీక్‌ వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ లీక్‌కు సంబంధించి గ‌త కొద్ది రోజులుగా ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద విద్యార్థులు నిర‌స‌న‌లు చేస్తోన్నారు. జ‌న‌తా కాక్రోచ్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సాగుతోన్న ఈ నిర‌స‌న‌ల‌కు ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. రోజురోజుకు ఈ పోరాటం ఉధృత‌మ‌వుతోంది.

వెబ్ సిరీస్‌....

కాగా నీట్ పేప‌ర్ లీక్ క‌థ‌తో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. ది స్కామ్ లీక్‌డ్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసింది. ఒక నిమిషం తొమ్మిది సెకండ్ల నిడివితో కూడిన ఈ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. భారీ సెక్యూరిటీ మ‌ధ్య చాలా ర‌హ‌స్యంగా ఎగ్జామ్స్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్స్ ప్రింట్ అయ్యే సీన్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది. ఆ త‌ర్వాత కాన్ఫిడెన్షియల్ ట్యాగ్‌తో వాటిని సీల్ చేయ‌డం... వాటిని వెహికిల్స్‌లోకి షిఫ్ట్ చేసే క్ర‌మంలో ఓ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ మిస్స‌యిన‌ట్లుగా చూపించారు. ఆ క్వశ్చన్ పేపర్‌ను దొంగిలించిన వ్య‌క్తి ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో మ‌రొక‌రికి పంపించిన‌ట్లు చూపించారు. లీక్ ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డ‌టం, విద్యార్థుల‌, ధ‌ర్నాలు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో టీజ‌ర్ ఎమోష‌న‌ల్‌గా ఎండ్ చేశారు. నీట్ లీక్ త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను చాలా వ‌ర‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ వెబ్‌సిరీస్‌లో చూపించారు.

యాక్ట‌ర్ల వివ‌రాలు సీక్రెట్‌...

ఒక్క క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లీక్‌తో మిలియ‌న్ల మంది విద్యార్థుల‌ క‌ల‌లు ఎలా చేదిరిపోయాయనే అంశాల‌తో ది స్కామ్ లీక్‌డ్ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సిరీస్‌లో బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది సీనియ‌ర్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వారి వివ‌రాల‌ను మాత్రం జీ5 వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే ది స్కామ్ లీక్‌డ్ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్న‌ది. ఆగ‌స్ట్‌లో ది స్కామ్ లీక్‌డ్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మంచి టైమింగ్‌...

ఈ వెబ్‌సిరీస్‌కు ఆనంద్ సింగ్‌, ప్ర‌గ‌తి దేశ్‌ముఖ్‌, స‌మీర్ ఎస్ రెడీజ్ వంటి సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మంచి టైమింగ్ చూసి మేక‌ర్స్ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు. ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ సిరీస్‌లో చూపించారంటూ చెబుతోన్నారు. అయితే ఈ సిరీస్‌ను బ్యాన్ చేసే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సిరీస్ అస‌లు రిలీజ్ అవుతుందా? అంటూ కామెంట్లు పెడుతోన్నారు.

 

 

Advertisement
Advertisement