త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Story 2 OTT | ఓటీటీలోకి వివాదాస్ప‌ద మూవీ కేర‌ళ స్టోరీ 2 – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ మూవీ ది కేర‌ళ స్టోరీ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి. మే 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ వివాదాస్ప‌ద సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఉల్కా గుప్తా, అదితా భాటియా, ఐశ్వ‌ర్య ఓజా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు కామాఖ్య నారాయ‌ణ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Apr 24, 2026, 2.39 pm IST

Kerala Story 2 OTT | ఓటీటీలోకి వివాదాస్ప‌ద మూవీ కేర‌ళ స్టోరీ 2 – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
Advertisement

kerala story 2 OTT |  ఈ ఏడాది అత్యంత వివాదాస్ప‌ద సినిమాగా నిలిచిన ది కేర‌ళ స్టోరీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి. మే 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. కేవ‌లం హిందీలో మాత్ర‌మే ది కేర‌ళ స్టోరీ 2 విడుద‌ల కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సీక్వెల్‌...

2023లో రిలీజైన ది కేర‌ళ స్టోరీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితా భాటియా, ఐశ్వ‌ర్య ఓజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కామాఖ్య నారాయ‌ణ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. కేర‌ళ స్టోరీ సంచ‌ల‌న విజ‌యంతో రిలీజ్ ముందు ఈ సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అదే స్థాయిలో సినిమాపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

కేర‌ళ సీఎం...

కేర‌ళ స్టోరీ 2ను బ్యాన్ చేయాలంటూ కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌తో పాటు ప‌లువురు సెలిబ్రిటీలు ట్వీట్స్ చేశారు. కేర‌ళ రాష్ట్రాన్ని ఉగ్ర‌వాదులకు నిల‌యంగా ఈ సినిమాలో త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేశారు. అనేక వివాదాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 45 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

ల‌వ్ జిహాద్‌...

ల‌వ్ జిహాద్‌, గ‌జ్వా ఏ హింద్ లాంటి కుట్ర‌ల‌ను చ‌ర్చిస్తూ ద‌ర్శ‌కుడు కామాఖ్య నారాయ‌ణ్ సింగ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. వాస్త‌వాల‌ను ప‌క్క‌న‌పెట్టి పూర్తిగా క‌ల్పిత అంశాల‌తో ఈ సినిమాను రూపొందించిన‌ట్లు విమ‌ర్శ‌లొచ్చాయి.

మూడు క‌థ‌ల‌తో..

ముగ్గురు యువ‌తుల జీవితాల నేప‌థ్యంలో మూడు ఉప‌క‌థ‌ల‌తో ది కేర‌ళ స్టోరీ 2 సినిమా రూపొందింది.దివ్య‌కు సోష‌ల్ మీడియా అంటే పిచ్చి. రీల్స్ చేస్తూ ఫేమ‌స్ అవ్వాల‌ని క‌ల‌లుకంటుంది. దివ్య‌ను సెలిబ్రిటీని చేస్తాన‌ని ర‌షీద్ అనే వ్య‌క్తి న‌మ్మిస్తాడు. ర‌షీద్ మాయ‌లో ప‌డిన దివ్య అత‌డిని పెళ్లిచేసుకుంటుంది. పెళ్లి త‌ర్వాత ఆమె పేరును అలియాగా మారుస్తాడు ర‌షీద్‌. పెళ్లి త‌ర్వాత దివ్య జీవితం ఎలా న‌ర‌క‌ప్రాయంగా మారింది...
నేహా ఓ అథ్లెట్‌. జావెలిన్ త్రో గేమ్స్‌లో నేష‌న‌ల్స్‌లో పోటీప‌డాల‌ని అనుకుంటుంది. రాజు అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డిన నేహా అత‌డిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి త‌ర్వాతే రాజు అస‌లు పేరు ఫైజాన్ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. వేశ్య‌గా మారిన నేహా జీవితం చివ‌ర‌కు ఎలా విషాదంగా ముగిసింది అన్న‌ది మ‌రో క‌థ‌.
స‌లీమ్ అనే జ‌ర్న‌లిస్ట్‌తో సురేఖ‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ఉన్న‌త భావాలు క‌లిగిన వ్య‌క్తిగా సురేఖ ముందు న‌టిస్తాడు పెళ్లి త‌ర్వాత స‌లీమ్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. సురేఖ‌ను బీఫ్ తిన‌మ‌ని బ‌ల‌వంతం చేస్తాడు. మ‌త మార్పిడికి ఓప్పుకోక‌పోవ‌డంతో ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తాడు? అత‌డి బారి నుంచి సురేఖ త‌ప్పించుకుందా? లేదా అన్న‌ది మ‌రో క‌థ‌.

Advertisement
Advertisement