త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Kerala Story 2 | భారీగా పెరిగిన కేర‌ళ స్టోరీ 2 క‌లెక్ష‌న్స్ – రెండు రోజుల్లో వ‌చ్చింది ఎంతంటే?

కేర‌ళ స్టోరీ 2 మూవీ క‌లెక్ష‌న్స్ ఫ‌స్ట్‌డేతో పోలిస్తే రెండో రోజు భారీగా పెరిగాయి. తొలిరోజు కేవ‌లం 75 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టిన ఈ మూవీ రెండో రోజు ఏకంగా ఐదు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ కేర‌ళ స్టోరీ 2 అనే హ్యాష్‌ట్యాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది

N

Entertainment | Published On Mar 1, 2026, 5.01 pm IST

The Kerala Story 2 | భారీగా పెరిగిన కేర‌ళ స్టోరీ 2 క‌లెక్ష‌న్స్ – రెండు రోజుల్లో వ‌చ్చింది ఎంతంటే?
Advertisement

The Kerala Story 2 | వివాదాల న‌డుమ రిలీజైన కేర‌ళ స్టోరీ 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. మొద‌టి రోజు కేవ‌లం 75 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టిన ఈ మూవీ రెండో రోజు ఏకంగా ఐదు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఓవ‌రాల్‌గా రెండు రోజుల్లో ఈ మూవీ ఐదు కోట్ల డెబ్భై ఐదు ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. మూడో రోజు మ‌రింత వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఆదివారం రోజుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ మూడు కోట్లు దాటిన‌ట్లు స‌మాచారం. మూడో రోజు దాదాపుగా ఏడు నుంచి ప‌ది కోట్ల మ‌ధ్య వ‌సూళ్లు రావ‌చ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ కేర‌ళ స్టోరీ 2 అనే హ్యాష్‌ట్యాగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఫ‌స్ట్ షో నుంచి స్క్రీనింగ్‌...

కేర‌ళ స్టోరీ 2ను రిలీజ్ చేయ‌ద్దంటూ కేర‌ళ సీఏంతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు డిమాండ్ చేస్తోన్నారు. ఈ వివాదాల కార‌ణంగా విడుద‌ల‌కు ముందురోజు కేర‌ళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధించింది. దాంతో మేక‌ర్స్ డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు. డివిజ‌న్ బెంచ్ ఈ స్టేను ఎత్తివేయ‌డంతో ఫిబ్ర‌వ‌రి 27న ఫ‌స్ట్ షో నుంచి కేర‌ళ స్టోరీ 2 స్క్రీనింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. అందుకే తొలిరోజు ఈ మూవీ 75 ల‌క్ష‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ల‌వ్ జిహాద్‌...

ల‌వ్ జిహాద్‌, గ‌జ్వా ఏ హింద్ లాంటి వివాదాస్ప‌ద అంశాల‌ను ట‌చ్ చేస్తూ ద‌ర్శ‌కుడు కామ‌ఖ్య నారాయ‌ణ్‌సింగ్ కేర‌ళ స్టోరీ 2 మూవీని తెర‌కెక్కించారు. ప్రేమ పేరుతో ముగ్గురు ఎలా మోస‌పోయారు? మ‌తం మారిన వారిని ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? చివ‌ర‌కు వారి జీవితం ఎలా విషాదంగా ముగిసింది అనే అంశాల‌తో కేర‌ళ స్టోరీ 2 మూవీ రూపొందింది.ఈ సినిమాలో ఉల్కా గుప్తా, ఐశ్వ‌ర్య ఐజా, అధితి భాటియా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2023లో వ‌చ్చిన కేర‌ళ స్టోరీకి సీక్వెల్‌గా కేర‌ళ స్టోరీ 2 మూవీ రూపొందింది.
.

Advertisement
Advertisement