Kerala Story 2 | కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్ – స్టే ఎత్తేసిన కోర్టు
కేరళ స్టోరీ 2 వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటూ హైకోర్టులోని సింగిల్ బెంచ్ స్టే విధించింది. తాజాగా సింగిల్ బెంచ్ స్టేను శుక్రవారం డివిజన్ బెంచ్ ఎత్తేసింది.
Entertainment | Published On Feb 27, 2026, 5.31 pm IST
Kerala Story 2 | కేరళ స్టోరీ 2 రిలీజ్ వివాదం సినిమాకు మించిన ట్విస్ట్‌లతో సాగుతుంది. కేరళ స్టోరీ 2ను రిలీజ్ చేయడానికి వీలులేదంటూ కేరళ హైకోర్టులోని సింగిల్ బెంచ్ గురువారం స్టే విధించింది. తాజాగా శుక్రవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ సినిమాపై ఉన్న స్టేను ఎత్తివేసింది. డివిజన్ బెంచ్ తీర్పుతో కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి.
సెన్సార్ సర్టిఫికేట్...
కేరళ స్టోరీ 2 సినిమాలో కేరళ రాష్ట్రాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ, ఈ సినిమాను విడుదల చేయడానికి వీలులేదంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడంలో సీబీఎఫ్‌సీ నియమనిబంధనలు సరిగా పాటించలేదంటూ ఫైర్ అయ్యింది. కేరళ స్టోరీకి సంబంధించి వస్తోన్న అభియోగాలను దృష్టిలో పెట్టుకొని సెన్సార్ విషయంలో పునఃపరిశీలించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. సీబీఎఫ్‌సీతో పాటు నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. సినిమా రిలీజ్‌పై సింగిల్ బెంచ్ స్టేను విధించడంతో ఫిబ్రవరి 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదాపడింది.
లైన్ క్లియర్...
సింగిల్ బెంచ్ తీర్పుపై నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. నిర్మాతల పిటిషన్‌పై విచారించిన డివిజన్ బెంచ్ ప్రజల్లో ఉన్న అంచనాలు, అపోహల ఆధారంగా సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నది. సీబీఎఫ్‌సీ ఇప్పటికే కేరళ స్టోరీ 2ను చూసి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతూ సర్టిఫికేట్ జారీ చేసిందని డివిజన్ బెంచ్ గుర్తుచేసింది. వివాదాస్పద అంశాలతో కూడిన ఈ సినిమాను రిలీజ్ చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉందంటూ పిటిషన్ వాదనతో డివిజన్ బెంచ్ ఏకీభవించలేదు. శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వానికి సంబంధించినదని, వాటికి సినిమా రిలీజ్‌ను ముడిపెట్టవద్దని డివిజన్ బెంచ్ అన్నది. కోర్టు తీర్పుపై దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. నిజాలను నిర్భయంగా చెప్పాలనే ప్రయత్నంతోనే తాము చేసిన సినిమా ఇదని పేర్కొన్నారు.
ముగ్గురు హీరోయిన్లు...
ది కేరళ స్టోరీ 2 మూవీకి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించాడు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించాడు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కోర్టు స్టే కారణంగా వాయిదాపడింది. 2023లో వచ్చిన కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
ఆగస్టు 6, 2026

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ – సీన్ సీన్‌కో మలుపు
జులై 26, 2026

Monalisa Bhosle | “మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం”: కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



