త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Ramakrishna | భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే …ఖాళీ థియేట‌ర్లే గ‌తి – రాహుల్ రామ‌కృష్ణ ట్వీట్ వైర‌ల్‌

టాలీవుడ్ న‌ష్టాల‌పై క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ప్రేక్ష‌కుడి డ‌బ్బుకు, స‌మ‌యానికి విలువ‌నిచ్చే సినిమాలు తీయాల‌ని , లేదంటే థియేట‌ర్ల‌ను అన్ని ఇలానే ఖాళీగా ఉంటాయ‌ని రాహుల్ రామ‌కృష్ణ అన్నారు

N

Entertainment | Published On May 12, 2026, 5.19 pm IST

Rahul Ramakrishna | భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే …ఖాళీ థియేట‌ర్లే గ‌తి – రాహుల్ రామ‌కృష్ణ ట్వీట్ వైర‌ల్‌
Advertisement

Rahul Ramakrishna | గ‌తంలో స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు స్టార్ హీరోల సినిమాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడేవి. రికార్డులు, క‌లెక్ష‌న్ల తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి క‌నిపించేది. కానీ ఈ సారి సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాప‌డ‌టం, మ‌రోవైపు ఐపీఎల్ ఎఫెక్ట్ కార‌ణంగా థియేట‌ర్లు మొత్తం ఖాళీగా క‌నిపిస్తున్నాయి. గ‌త రెండు నెల‌ల్లో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా హిట్టు టాక్ తెచ్చుకోలేక‌పోయింది. క‌నీసం పెట్టిన పెట్టుబ‌డిని కూడా రాబ‌ట్ట‌లేక‌పోయాయి.

అజ్ఞాన‌మే...

టాలీవుడ్ న‌ష్టాల‌ను క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ రియాక్ట్ అయ్యారు. భారీగా పెరిగిన టికెట్ రేట్లు, ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌ల కార‌ణంగా థియేట‌ర్లు మొత్తం ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌ని, ఇక‌నైనా మూస ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డితే మంచిదంటూ పేర్కొన్నారు. "ఎండ‌లు, ట్రాఫిక్, పార్కింగ్ క‌ష్టాలు, పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు, థియేట‌ర్ల‌లో ఉండే భారీ స్నాక్స్ రేట్లు వీట‌న్నింటిని దాటుకొని అల‌సిపోయిన సామాన్యుడు థియేట‌ర్ల‌కు రావాలంటే మంచి క‌థ‌ల‌తో సినిమాలు తీయాలి. ఔట్‌డేటెడ్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించాల‌నుకోవ‌డం అజ్ఞాన‌మే అవుతుంది" అని రాహుల్ రామ‌కృష్ణ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈగోల‌ను ప‌క్క‌న‌పెట్టి...

"ప్రేక్ష‌కుడి డ‌బ్బుకు, స‌మ‌యానికి విలువ‌నిచ్చే సినిమాలు తీయాల‌ని , లేదంటే థియేట‌ర్ల‌ను అన్ని ఇలానే ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తాయ‌ని రాహుల్ రామ‌కృష్ణ అన్నారు. ఫోన్ స్క్రీన్ల‌కు మించిన అద్భుతాన్ని, అనుభూతిని అందించిన‌ప్పుడే ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు వ‌స్తారు...లేదంటే ఇంటిప‌ట్టునే ఉంటూ టీవీల‌కే ప‌రిమితమ‌వుతారు. సినిమా క్రాఫ్ట్ టెక్నిక్స్‌ను అర్థం చేసుకునే నాలెడ్జ్ ఆడియెన్స్‌కు లేద‌నే భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాలి" అని రాహుల్ రామ‌కృష్ణ అన్నారు. భారీగా పెరిగిన టికెట్ రేట్ల‌పై పున‌రాలోచించుకోవాల‌ని అన్నారు. వ‌రుస డిజాస్ట‌ర్ల‌ను చూసైనా మూస ఆలోచ‌న‌లు, ఈగోల‌ను ప‌క్క‌న‌పెట్టి మంచి సినిమాలు చేసేందుకు ప్ర‌య‌త్నించాల‌ని, ఖాళీ థియేట‌ర్ల‌ను చూసైనా త‌ప్పుల‌ను గ్ర‌హించాల‌ని రాహుల్ రామ‌కృష్ణ పేర్కొన్నారు. అత‌డి ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

 

 

Advertisement
Advertisement