త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tharun Bhascker | ఫ్రెండ్ కంటే ఎక్కువ – త్వ‌ర‌లో గుడ్‌న్యూస్ చెప్తా- ఈషారెబ్బాతో పెళ్లిపై త‌రుణ్ భాస్క‌ర్‌ రియాక్ష‌న్‌

ఈషారెబ్బాతో ప్రేమ‌, పెళ్లి వార్త‌ల‌పై త‌రుణ్ భాస్క‌ర్ రియాక్ట్ అయ్యారు. ఈషా త‌న‌కు ఫ్రెండ్ కంటే ఎక్కువ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్ చెబుతాన‌ని ఓం శాంతి శాంతి శాంతి మూవీ ప్ర‌మోష‌న్స్‌లో త‌రుణ్ భాస్క‌ర్ చెప్పాడు.

N

Entertainment | Published On Jan 27, 2026, 6.31 pm IST

Tharun Bhascker | ఫ్రెండ్ కంటే ఎక్కువ – త్వ‌ర‌లో గుడ్‌న్యూస్ చెప్తా- ఈషారెబ్బాతో పెళ్లిపై త‌రుణ్ భాస్క‌ర్‌ రియాక్ష‌న్‌
Advertisement

Tharun Bhascker | హీరోయిన్ ఈషారెబ్బాతో డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా క‌లిసి ఓం శాంతి శాంతి శాంతి సినిమా చేస్తున్నారు. జ‌న‌వ‌రి 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఫ్రెండ్ కంటే ఎక్కువ‌...

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఈషారెబ్బాతో ప్రేమ‌వార్త‌ల‌పై త‌రుణ్ భాస్క‌ర్ రియాక్ట్ అయ్యారు. ఈ రూమ‌ర్ల గురించి చెప్ప‌డానికి దాచ‌డానికి ఏం లేదు. "ఈషా నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ‌. గ‌త మూడేళ్లుగా ఆమె నాకు అన్నీ. నేను ఏమ‌న్నా చెబితే వేరేవాళ్ల జీవితానికి ఎఫెక్ట్ అవుతుంద‌ని ఇన్నాళ్లు ఆగిపోయా. నాకు అలాంటి వార్త‌ల‌ను ఎదుర్కోవ‌డం అల‌వాటే. అన్ని అనుకుంటున్న‌ట్లు జ‌రిగితే త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్ చెబుతా" అని త‌రుణ్ భాస్క‌ర్ అన్నాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

డేటింగ్‌లో ఉన్నా...

త‌రుణ్ భాస్క‌ర్‌తో ప్రేమాయ‌ణంపై ఈషారెబ్బా కూడా స్పందించింది తాను ఓ వ్య‌క్తితో డేటింగ్‌లో ఉన్నాన‌ని చెప్పింది. .త‌మ ల‌వ్‌స్టోరీ ప్రారంభ ద‌శ‌లోనే ఉంద‌ని అన్న‌ది. త‌రుణ్ పేరు మాత్రం వెల్ల‌డించ‌లేదు.
కాగా త‌రుణ్ భాస్క‌ర్‌కు ఇది వ‌ర‌కే పెళ్ల‌య్యింది. కాస్ట్యూమ్ డిజైన‌ర్ ల‌తా నాయుడును పెళ్లిచేసుకున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా వీరిద్ద‌రు విడిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌ల‌యాళ రీమేక్‌...

ఓం శాంతి శాంతి శాంతి మూవీకి ఏఆర్ సంజీవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన జ‌య‌జ‌య‌జ‌య‌జ‌య‌హే మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. భ‌ర్త పెట్టే బాధ‌ల‌ను భ‌రించ‌లేక అత‌డిపై ఎదురుతిరిగే భార్య‌గా ఈషారెబ్బా క‌నిపించ‌బోతుంది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత ఈషారెబ్బా చేస్తున్న సినిమా ఇది.
కాగా పెళ్లి చూపులు మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు త‌రుణ్ భాస్క‌ర్‌. తొలి సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు. ఈ న‌గ‌రానికి ఏమైందితో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. గ‌త కొన్నాళ్లుగా డైరెక్ష‌న్‌కు బ్రేక్ తీసుకున్న త‌రుణ్ భాస్క‌ర్ యాక్ట‌ర్‌గా ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాడు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement