త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా లేటెస్ట్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్‌డేట్‌, ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్‌

త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా హీరోహీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్ కామెడీ మూవీ ఓ శాంతి శాంతి శాంతి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. మార్చి 4న ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 23, 2026, 6.40 pm IST

Telugu OTT | ఓటీటీలోకి త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా లేటెస్ట్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్‌డేట్‌, ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్‌
Advertisement

Telugu OTT | టాలీవుడ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ( Tharun Bhascker) హీరోగా న‌టించిన ఓ శాంతి శాంతి శాంతి డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా నిలిచింది. ఏఆర్ సంజీవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఈషారెబ్బా (Eesha Rebba) హీరోయిన్‌గా న‌టించింది. జ‌న‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

ఆహా ఓటీటీలో...

తాజాగా ఓం శాంతి శాంతి శాంతి మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ సోమ‌వారం క‌న్ఫామ్ అయ్యాయి. మార్చి 4న ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. గోల్డ్ యూజ‌ర్స్ ఒక రోజు ముందే ఈ సినిమాను చూడొచ్చ‌ని ఆహా ప్లాట్‌ఫామ్‌ ప్ర‌క‌టించింది. విడుద‌ల తేదీని వెల్ల‌డిస్తూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

మ‌ల‌యాళ రీమేక్‌...

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన జ‌య‌జ‌య‌జ‌య‌జ‌య‌మే మూవీకి రీమేక్‌గా ఓ శాంతి శాంతి శాంతి మూవీ రూపొందింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్ట‌ర్ సంజీవ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్‌, కామెడీ బాగున్నానిర్మాత‌ల‌కు మాత్రం ఈ మూవీ లాభాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. థియేట‌ర్ల‌లో కోటిలోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఓం శాంతి శాంతి శాంతి సినిమాకు జై క్రిష్ మ్యూజిక్ అందించాడు.

ఓంకార్‌, ప్ర‌శాంతి యుద్ధం...

ఉన్న‌త చ‌దువుల‌ను పూర్తిచేసి మంచి ఉద్యోగం చేయాల‌ని క‌ల‌లు కంటుంది ప్ర‌శాంతి (ఈషా రెబ్బా). కానీ కాలేజీలో జ‌రిగిన ఓ గొడ‌వ వ‌ల్ల ఆమె జీవితం త‌ల‌క్రిందుల‌వుతుంది. ఆమె చ‌దువును ఆపేసిన త‌ల్లిదండ్రులు ఓంకార్‌నాయుడు ( త‌రుణ్ భాస్క‌ర్‌) అనే చేపల వ్యాపారితో ప్ర‌శాంతి పెళ్లి చేస్తారు. చిన్న చిన్న విష‌యాల‌కు సైతం భార్య‌పై చేయిచేసుకుంటాడు ఓంకార్‌నాయుడు. భ‌ర్త హింస‌ల‌ను భ‌రించ‌లేక ఓంకార్‌కు ఎదురుతిరుగుతుంది ప్ర‌శాంతి. అత‌డిని చిత‌క్కొడుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? ప్ర‌శాంతి చేసిన ప‌ని వ‌ల్ల ఆమె కాపురంలో ఎలాంటి క‌ల‌త‌లు రేగాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

పెళ్లి వార్త‌లు...

త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు పెళ్లిచేసుకోనున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతి త‌ర్వాత గాయ‌ప‌డ్డ సింహం పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement