త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anaswara Rajan | టాలీవుడ్‌లో బిజీ అవుతోన్న మ‌ల‌యాళ బ్యూటీ – రొమాంటిక్ ల‌వ్‌స్టోరీలో హీరోయిన్‌గా…

చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మెగా 158లో మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర రాజ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమా కంటే ముందే రొమాంటిక్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇట్లు అర్జున పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.

N

Entertainment | Published On May 24, 2026, 8.41 pm IST

Anaswara Rajan | టాలీవుడ్‌లో బిజీ అవుతోన్న మ‌ల‌యాళ బ్యూటీ – రొమాంటిక్ ల‌వ్‌స్టోరీలో హీరోయిన్‌గా…
Advertisement

Anaswara Rajan |  మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర రాజ‌న్ టాలీవుడ్‌లో బిజీ అవుతోంది. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టించిన ఛాంపియ‌న్‌తో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మెగా 158లో అన‌స్వ‌ర రాజ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ కూడా కూడా మొద‌లైంది.

ఇట్లు అర్జున‌...

చిరంజీవి సినిమా కంటే ముందే అన‌స్వ‌ర రాజ‌న్ ఓ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇట్లు అర్జున పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాతో అనీష్ హీరోగా న‌టిస్తున్నాడు. అన‌స్వ‌ర రాజ‌న్ క‌థానాయిక‌గా క‌నిపించ‌నున్న‌ ఈ సినిమాను డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఇట్లు అర్జున టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు నాగార్జున వాయిస్ ఓవ‌ర్ అందించారు.

హాయ్ రే...

తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల‌ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. హాయ్ రే అంటూ మెలోడీ ప్ర‌ధానంగా ఈ పాట సాగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో కిటికీ పక్కన ఆలోచనల్లో అన‌స్వ‌ర మునిగిపోయి ఉండ‌గా... ఆమెను మౌనంగా ప్రేమతో చూస్తున‌ట్లుగా అనీష్ క‌నిపిస్తున్నాడు.

త‌మ‌న్ మ్యూజిక్‌...

ఇట్లు అర్జున మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో బ్యాన‌ర్ ప్రారంభించిన వెంకీ కుడుముల తొలి ప్ర‌య‌త్నంగా ఇట్లు అర్జున సినిమాను నిర్మించారు. మ‌హేష్ ఉప్ప‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మూగ అబ్బాయికి, మోడ్ర‌న్ అమ్మాయికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌తో యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ద‌ర్శ‌కుడిగా ఛ‌లో, భీష్మ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు వెంకీ కుడుముల‌.

 

Advertisement
Advertisement