Thalapathy Vijay | నా విడాకుల గురించి కాదు…రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచిద్దాం – దళపతి విజయ్ పిలుపు
విడాకులపై విజయ్ రియాక్ట్ అయ్యారు. తన వ్యక్తిగత సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవద్దని, వాటిని తాను పరిష్కరించుకోగలనని చెప్పారు. అవన్నీ సమయాన్ని కేటాయించేంత ముఖ్యమైనవి కావని అభిమానులకు విజయ్ పిలుపునిచ్చారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి
Entertainment | Published On Mar 7, 2026, 7.28 pm IST
Thalapathy Vijay | దళపతి విజయ్ విడాకుల వ్యవహారం కోలీవుడ్ నాట సంచలనంగా మారింది. ఓ హీరోయిన్‌తో విజయ్‌కి వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ విజయ్ భార్య సంగీత ఇటీవల కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ విడాకుల వార్తల నడుమ విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరుకావడం తమిళ సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. విజయ్, త్రిష ప్రేమలో ఉన్నది నిజమేనని, భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను విజయ్ పెళ్లిచేసుకోబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ టీవీకే పార్టీ నుంచి త్రిష కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నేను పరిష్కరించుకుంటా...
తాజాగా విడాకులతో పాటు వ్యక్తిగత జీవితంలోని సమస్యలపై విజయ్ రియాక్ట్ అయ్యారు. సోమవారం చెన్నైలో టీవీకే పార్టీ మేనిఫెస్టోను విజయ్ విడుదల చేశారు. ఈ సభలో తన సమస్యలను తాను పరిష్కరించుకుంటానని, వాటి గురించి ఎవరూ కంగారు పడొద్దని విజయ్ అన్నారు. "గత కొద్ది రోజులుగా నా చుట్టూ చాలా జరుగుతున్నాయి. కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటివల్ల నన్ను అభిమానించే వారు బాధపడటం నాకు ఇష్టం లేదు. మీరు ఆందోళన పడటం చూస్తుంటే నా మనసు బరువెక్కుతోంది. నా సమస్యలను నేను పరిష్కరించుకోగలను. అవన్నీ మీ సమయాన్ని కేటాయించేంత విలువైనవి, ముఖ్యమైనవి కావని అనుకుంటున్నా. చాలా చిన్నవి. వాటికి బదులుగా రాష్ట్ర సంక్షేమంపై దృష్టిపెడదాం" అంటూ విజయ్ ఈ సభలో పేర్కొన్నారు. విడాకులను ఉద్దేశించే విజయ్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
మరో పిటిషన్...
ఇటీవలే విడాకుల కోసం కోర్టు మెట్టు ఎక్కిన సంగీత తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకులు మంజూరు అయ్యే వరకు విజయ్ ఇంట్లోనే తాను ఉంటానని, అందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. గత ఇరవై ఆరేళ్లుగా విజయ్‌తో కలిసి ఉన్న ఇంట్లోకి తనను అనుమతించడం లేదని, ఆ ఇంటిలో తనకు సగం వాటా ఉందని సంగీత పేర్కొన్నది. సంగీత పిటిషన్ కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. విజయ్, సంగీత విడాకుల పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరుగనున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026

Pawan Kalyan on Vijay | తమిళనాడు పరిస్థితులు వేరు, మనవి వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీ పోలికలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మే 17, 2026

Rajinikanth | విజయ్ గెలుపుపై ఎలాంటి అసూయ లేదు – నీచపు రాజకీయాలు చేయను – రజనీకాంత్ కామెంట్స్
మే 17, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



