Trisha | దళపతి విజయ్ విజయ్ మీటింగ్ – త్రిష షూటింగ్ – ఇద్దరూ లండన్‌లోనే!
తమిళనాడు సీఎం దళపతి విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నాడు. ఈ లండన్ టూర్‌లో భాగంగా హీరో అజిత్ బరిలో ఉన్న మోటార్ రేసింగ్ పోటీలకు విజయ్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నాడు. ఈ వేడుకలో విజయ్‌తో పాటు త్రిష కూడా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఓ హారర్ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా లండన్‌లోనే జరుగుతోంది.
Entertainment | Published On Sep 12, 2026, 2.49 pm IST
Trisha |తమిళనాడు సీఎం దళపతి విజయ్, చెన్నై క్వీన్ త్రిష లండన్‌లో ఒకే వేదిక మరోసారి కలిసి కనిపించబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. పెట్టుబడుల సేకరణ నిమిత్తం దళపతి విజయ్ ఇటీవలే లండన్ వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు లండన్‌లోనే పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. మరోవైపు చెన్నై క్వీన్ త్రిష కూడా లండన్‌లోనే ఉంది. ఇటీవలే త్రిష హీరోయిన్‌గా ఓ సైకలాజికల్ హారర్ మూవీ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతుంది.
మోటర్ రేసింగ్ పోటీ
విజయ్, త్రిష కలిసి లండన్‌లో ఓ ఈవెంట్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా తమిళ హీరో అజిత్ సినిమాల కంటే మోటర్ రేసింగ్ పోటీలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. లండన్‌లో శనివారం జరుగనున్న మిచెలిన్ లీ మాన్స్ కప్ మోటార్ రేసింగ్ పోటీల్లో అజిత్ పాల్గొంటున్నాడు. ఈ మోటార్ రేసింగ్ పోటీలకు చీఫ్ గెస్ట్‌గా విజయ్ అటెండ్ కాబోతున్నారు. గ్రీన్‌ఫ్లాగ్ ఊపి రేస్‌ను ప్రారంభించబోతున్నారు.
ఒకే ఈవెంట్...
శనివారం రేసింగ్ పోటీల ఆరంభ వేడుకలకు త్రిష కూడా అటెండ్ కానున్నట్లు సమాచారం. విదేశాల్లో విజయ్, త్రిష ఒకే ఈవెంట్‌లో కలిసి కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. రేసింగ్ పోటీ కోసం సన్నద్ధమవుతోన్న అజిత్‌ను శుక్రవారం సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ కలిసింది. ఆమె వెంట త్రిష కూడా ఉన్నట్లు చెబుతోన్నారు. త్రిషతో దిగిన ఓ సెల్ఫీ ఫొటోను రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ప్రమాణ స్వీకారోత్సవంలో...
దళపతి విజయ్, త్రిష బంధంపై తమిళనాట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లిచేసుకోబోతున్నారని అంటున్నారు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలో త్రిష పాల్గొన్నది. అంతే కాకుండా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష అటెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malavika Mohanan | దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ – త్రిష నుంచి మెసేజ్ – సీక్రెట్ రివీల్ చేసిన మాళవికా మోహనన్
సెప్టెంబర్ 10, 2026

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి – మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
సెప్టెంబర్ 10, 2026

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ●GHMC Sports Grounds Privatization | పేద, మధ్యతరగతి పిల్లలకు ఆట స్థలాలను దూరం చేస్తారా?
- ●Vemula Prashanth Reddy | పేగులు మెడలేసుకుంటే 24 గంటల కరెంట్ రాలే అధ్యక్షా
- ●Miss England Allegations Congress | దీనికి ఏమైనా సమాధానం ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ?
- ●Minister Komatireddy | నాగ్‌పూర్–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే 2027 డిసెంబర్ నాటికి పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
- ●Zomato | జొమాటో బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు ఛార్జీలు

TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

GHMC Sports Grounds Privatization | పేద, మధ్యతరగతి పిల్లలకు ఆట స్థలాలను దూరం చేస్తారా?

Vemula Prashanth Reddy | పేగులు మెడలేసుకుంటే 24 గంటల కరెంట్ రాలే అధ్యక్షా

Miss England Allegations Congress | దీనికి ఏమైనా సమాధానం ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ?



