త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ – త‌న‌యుడి సినిమాకు త‌మిళ‌నాడు సీఎం స‌పోర్ట్ చేస్తారా?

ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీ సిగ్మా రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ జూలై 31న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. కొడుకు ఫ‌స్ట్ సినిమాకు విజ‌య్ స‌పోర్ట్ ఉంటుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On May 29, 2026, 3.30 pm IST

Thalapathy Vijay  | ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ – త‌న‌యుడి సినిమాకు త‌మిళ‌నాడు సీఎం స‌పోర్ట్ చేస్తారా?
Advertisement

Thalapathy Vijay | త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. సిగ్మా పేరుతో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాడు. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. జాస‌న్ సంజ‌య్ డైరెక్ష‌న‌ల్‌ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జూలై31న సిగ్మా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అఫీషియ‌ల్‌గా జాస‌న్ సంజ‌య్ ప్ర‌క‌టించాడు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇందులో యాక్ష‌న్ అవ‌తార్‌లో సందీప్ కిష‌న్ క‌నిపిస్తోన్నాడు.

ఫ‌రియా అబ్దుల్లా....

సిగ్మా మూవీలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పెద్ద క్రైమ్ సిండికేట్‌ను ఎదురించి ఓ సాధార‌ణ యువ‌కుడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో హీస్ట్ థ్రిల్ల‌ర్‌గా సిగ్మా మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

తెలుగులో రిలీజ్‌...

డైరెక్ట‌ర్‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డంతో కోలీవుడ్‌లో ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అందులోనూ విజ‌య్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రిలీజ్ అవుతోండ‌గా సిగ్మా అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

విజ‌య్ స‌పోర్ట్ ఉంటుందా?

జాస‌న్ సంజ‌య్ డెబ్యూ మూవీకి ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌పోర్ట్ చేస్తాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ అత‌డి భార్య సంగీత త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ముందు కోర్టును ఆశ్ర‌యించింది. విడాకుల వ్య‌వ‌హ‌రం కార‌ణంగా తండ్రిని జాస‌న్ సంజ‌య్ సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేశారు. ఈ విభేదాల నేప‌థ్యంలో సిగ్మాకు విజ‌య్ స‌పోర్ట్ ఉండ‌క‌పోవ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు సీఎం హోదాలో ఉండి ప్ర‌మోష‌న్స్‌కు అటెండ్ కావ‌డం క‌ష్ట‌మే కానీ సోష‌ల్ మీడియాలో కొడుకు సినిమాకు మ‌ద్ద‌తుగా విజ‌య్ ట్వీట్స్‌, పోస్ట్‌లు పెడితే బాగుంటుంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా తండ్రి స‌పోర్ట్ తోనే స్టార్ హీరోగా ఎదిగార‌ని, విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి అలాంటి స‌హ‌కార‌మే జాస‌న్ సంజ‌య్‌కి కూడా విజ‌య్ అందిస్తే బాగుంటుంద‌ని కామెంట్లు పెడుతోన్నారు.

 

 

Advertisement
Advertisement