త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhanush | రెండున్న‌ర కోట్ల వాచ్‌తో ధ‌నుష్ – “ఓం” ప్ర‌మోష‌న్స్‌లో దాని గురించే చ‌ర్చ‌!

రెండున్న‌ర కోట్ల ఖ‌రీదైన ల‌గ్జ‌రీ వాచ్‌తో కోలీవుడ్ హీరో ధ‌నుష్ ఓం మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాన్‌గార్డ్ బ్రాండ్‌కు చెందిన ఇలాంటి వాచ్‌లు ప్ర‌పంచవ్యాప్తంగా ఇర‌వై ఐదు మాత్ర‌మే ఉన్న‌ట్లు స‌మాచారం.

N

News | Published On Nov 15, 2026, 7.10 pm IST

Dhanush | రెండున్న‌ర కోట్ల వాచ్‌తో ధ‌నుష్ – “ఓం” ప్ర‌మోష‌న్స్‌లో దాని గురించే చ‌ర్చ‌!
Advertisement

Dhanush |  ధ‌నుష్ హీరోగా న‌టించిన ఓం మూవీ న‌వంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి అమ‌ర‌న్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

రెండున్న‌ర కోట్లు...

ఓం మూవీ పాన్ ఇండియ‌న్ ప్ర‌మోష‌న్స్‌తో ధ‌నుష్ బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో జ‌రిగింది. ఈ వేడుక‌కు ధ‌నుష్ రెండున్నర కోట్ల విలువైన ల‌గ్జ‌రీ వాచ్‌తో అటెండ్ కావ‌డం నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించింది. వాన్‌గార్డ్ బ్రాండ్‌కు చెందిన ఈ అరుదైన‌ ల‌గ్జ‌రీ వాచ్‌లు ప్ర‌పంచంలో మొత్తం 25 మాత్ర‌మే ఉన్నాయి. 18 క్యారెట్ల గోల్డ్‌తో ఈ వాచ్ త‌యారైంది. ఇందులో డైమండ్స్ పొదిగి ఉంటాయి. వాన్‌గార్డ్ ఆర్బ్ ఫ్ల‌యింగ్ టూర్‌బిలాన్ మోడ‌ల్‌కు చెందిన ఈ వార్ మెకానిజం, స్టైల్ రెగ్యుల‌ర్ వాచ్‌ల‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. డ‌య‌ల్ ఉండ‌దు. ఇందులోని పార్ట్స్ మొత్తం క‌నిపించేలా త్రీడీ డైమెన్ష‌న్‌తో రూపొందించారు. బంగారంతో పాటు టైటానియం వాడి ఈ వాచ్‌ను త‌యారు చేసిన‌ట్లు స‌మాచారం.

ఖ‌రీదైన వాచ్‌

ఈ వాచ్‌తో ధ‌నుష్ దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. ఇండియ‌న్ క‌రెన్సీలో ఈ వాచ్ ధ‌ర రెండు కోట్ల యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ధ‌నుష్ ద‌గ్గ‌ర ఉన్న ఖ‌రీదైన వాచ్ ఇదేన‌ని అంటున్నారు.

ఓం త‌ర్వాత‌...

ఓం త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు అంగీక‌రించాడు ధ‌నుష్‌. హీరోగానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా సినిమాలు చేస్తోన్నాడు. మ‌రోవైపు ధ‌నుష్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement