త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan – Vijay | ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగులో రీమేక్ చేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్ తమిళ సినిమాలు ఇవే – రెండు ఇండ‌స్ట్రీ హిట్స్‌

సినిమాలు, రాజ‌కీయాల ప‌రంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌ర్నీ మ‌ధ్య కొన్ని ద‌గ్గ‌రి పోలిక‌లు క‌నిపిస్తాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. విజ‌య్ హీరోగా న‌టించిన కొన్ని త‌మిళ సినిమాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగులోకి రీమేక్ చేశారు. ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On May 10, 2026, 7.54 pm IST

Pawan Kalyan – Vijay | ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగులో రీమేక్ చేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్ తమిళ సినిమాలు ఇవే – రెండు ఇండ‌స్ట్రీ హిట్స్‌
Advertisement

Pawan Kalyan - Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్....ఇద్ద‌రూ సినిమాల‌తో కెరీర్‌ను మొద‌లుపెట్టి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి డిప్యూటీ సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టారు. మ‌రోవైపు రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని నెల‌కొల్పిన విజ‌యం తాను పోటీ చేసిన తొలి ఎన్నిక‌ల్లోనే ఘ‌న విజ‌యం సాధించి త‌మిళ‌నాడు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఆడియో లాంఛ్‌కు....

రాజ‌కీయాల‌కు అతీతంగా ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బంగారం మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష చీఫ్ గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు. అంతే కాదు విజ‌య్ సినిమాల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లుమార్లు పోస్ట్‌లు, ట్వీట్స్ చేశారు.

ఒక్క‌డు, పోకిరి....

ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి కోలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ రావ‌డం వెనుక టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల కృషి కూడా కొంత ఉంది. తెలుగులో సూప‌ర్ హిట్‌గా నిలిచిన పోకిరి, ఒక్క‌డు, పెళ్లి సంద‌డితో పాటు ప‌లు సినిమాల‌ను విజ‌య్ త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల‌ను అందుకున్నారు.
అంతే కాదు...విజ‌య్ సినిమాల ఆధారంగా తెలుగులోనూ కొన్ని సినిమాలు వ‌చ్చాయి. విజ‌య్ కెరీర్‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన మూడు సినిమాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగులోకి రీమేక్ చేశారు. అందులో రెండు సినిమాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పెద్ద విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌గా...ఓ సినిమా మాత్రం యావ‌రేజ్‌గా నిలిచింది.

ల‌వ్ టుడే - సుస్వాగ‌తం...

విజ‌య్ హీరోగా 1997లో రిలీజైన ల‌వ్ టుడే మూవీ అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. థియేట‌ర్ల‌లో 175 రోజుల‌కుపైగా ఆడింది. విజ‌య్ క్లాసిక్‌ మూవీని తెలుగులో సుస్వాగ‌తం పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీమేక్ చేశారు. భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో దేవ‌యాని హీరోయిన్‌గా న‌టించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌వ‌ర్ స్టార్ ఇమేజ్‌ను ఈ సినిమానే తీసుకొచ్చింది.

ఖుషి...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఖుషి ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌. ఈ సినిమాలో సిద్ధార్థ‌రాయ్ పాత్ర‌లో ప‌వ‌న్ డైలాగ్స్‌, మ్యాన‌రిజ‌మ్స్‌తో థియేట‌ర్లు ఊగిపోయాయి. అయితే ఖుషి ఓ రీమేక్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. త‌మిళంలో ఖుషి పేరుతో ద‌ళ‌ప‌తి విజ‌య్ చేసిన సినిమా ఆధారంగా సేమ్ టైటిల్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెలుగులో ఈ మూవీ రూపొందింది. త‌మిళ వెర్ష‌న్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎస్‌జే సూర్య తెలుగు మూవీకి డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. రెండు భాష‌ల్లో ఖుషి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

అన్న‌వ‌రం...

క‌మ‌ర్షియ‌ల్ ఇమేజ్‌కు భిన్నంగా 2005లో ద‌ళ‌ప‌తి విజ‌య్ చేసిన తిరుపాచి మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో తెర‌కెక్కిన ఈ సినిమాను అన్న‌వ‌రం పేరుతో తెలుగులోకి రీమేక్ అయ్యింది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించాడు. త‌మిళ రిజ‌ల్ట్ మాత్రం తెలుగులో రిపీట్ కాలేదు. బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

 

Advertisement
Advertisement