త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌, మ‌హేష్‌బాబు క‌లిసి సినిమా చేయాల్సింది .. కానీ – త‌మిళ హీరో కామెంట్స్ వైర‌ల్‌

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్, టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కాల్సిన ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే?

N

Entertainment | Published On Jun 21, 2026, 11.44 am IST

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌, మ‌హేష్‌బాబు క‌లిసి సినిమా చేయాల్సింది .. కానీ – త‌మిళ హీరో కామెంట్స్ వైర‌ల్‌
Advertisement

Thalapathy Vijay | త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌, టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. క‌థ‌, డైరెక్ట‌ర్ ఫిక్స్ అయిన త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింద‌ట‌. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాపై ఓ ఇంట‌ర్వ్యూలో త‌మిళ హీరో ఆర్య ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

పొన్నియ‌న్ సెల్వ‌న్‌....

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్ట‌య్యింది. మ‌ణిర‌త్నం కెరీర్‌లో ఫ‌స్ట్ హిస్టారిక‌ల్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా వ‌చ్చింది. పొన్నియ‌స్ సెల్వ‌న్ 2 పేరుతో రూపొందిన ఈ సీక్వెల్‌ మాత్రం స‌రైన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.
ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీలో విక్ర‌మ్‌, త్రిష‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌, జ‌యం ర‌వి, కార్తితో పాటు ప‌లువురు కోలీవుడ్ టాప్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్‌...మ‌హేష్‌బాబు...

అయితే పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాను ద‌ళ‌ప‌తి విజ‌య్‌, మ‌హేష్‌బాబుల‌తో తెర‌కెక్కించాల‌ని మ‌ణిర‌త్నం అనుకున్నార‌ట‌. మ‌రో కీల‌క పాత్ర కోసం ఆర్య‌ను కూడా అప్రోచ్ అయ్యార‌ట‌. మ‌ణిర‌త్నంతో సినిమా చేయ‌డానికి విజ‌య్‌, మ‌హేష్ కూడా అంగీక‌రించార‌ట‌. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో ఒకేసారి భారీ స్థాయిలో మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లుపెట్టిన త‌ర్వాత బ‌డ్జెట్ ప‌ర‌మైన కార‌ణాల‌తో పాటు డేట్స్ ఇష్యూ వ‌ల్ల సినిమా ఆగిపోయింద‌ట‌. అలా ద‌ళ‌ప‌తి విజ‌య్‌, మ‌హేష్‌బాబు కాంబో మిస్స‌యింద‌ని హీరో ఆర్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఐశ్వ‌ర్య రాయ్‌...

స్టార్ హీరోల కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో చాలా ఏళ్ల పాటు పొన్నియ‌న్ సెల్వ‌న్ స్క్రిప్ట్‌ను మ‌ణిర‌త్నం ప‌క్క‌న‌పెట్టారు. లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ ముందుకు రావ‌డంతో చివ‌ర‌కు విక్ర‌మ్‌, త్రిష‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌ల‌తో చేశారు.

వార‌ణాసి....

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వార‌ణాసి సినిమా చేస్తోన్నారు మ‌హేష్‌బాబు. టైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతుంది. మ‌రోవైపు జ‌న‌నాయ‌గ‌న్ త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

 

Advertisement
Advertisement