త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | క‌ర్ణాట‌క‌లో జ‌న‌నాయ‌గ‌న్ స్క్రీనింగ్ నిలిపివేత – సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌ పోస్ట‌ర్లు చించేసిన ఆందోళ‌న‌కారులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ సినిమా మ‌రో చిక్కుల్లో ప‌డింది. కావేరీ న‌ది జ‌లాల వివాదం కార‌ణంగా క‌ర్ణాట‌క‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను నిలిపివేశారు. జ‌న‌నాయ‌గ‌న్ ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద క‌న్న‌డ సంఘాలు నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

N

Entertainment | Published On Jul 31, 2026, 4.02 pm IST

Jana Nayagan | క‌ర్ణాట‌క‌లో జ‌న‌నాయ‌గ‌న్ స్క్రీనింగ్ నిలిపివేత – సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌ పోస్ట‌ర్లు చించేసిన ఆందోళ‌న‌కారులు
Advertisement

Jana Nayagan | త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ సినిమాకు ఆది నుంచి అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆరు నెల‌లు వాయిదాప‌డిన ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. థియేట‌ర్ల‌లో విడుద‌లై వారం కూడా కాక‌ముందే కావేరి న‌దీ జ‌లాల వివాదం కార‌ణంగా క‌ర్ణాట‌క‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను నిలిపివేశారు. క‌ర్ణాట‌క‌లో జ‌న‌నాయ‌గ‌న్ ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

కావేరీ న‌దీ జ‌లాల వివాదం

కావేరీ న‌దీ జ‌లాల వినియోగానికి సంబంధించి క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు మధ్య సుదీర్ఘ కాలంగా వివాదాలు న‌డుస్తోన్నాయి. ప‌దిహేను రోజుల పాటు ప్ర‌తి రోజు 3500 క్యూసెక్కుల నీటిని త‌మిళ‌నాడుకు విడుద‌ల చేయాల‌ని కావేరి వాట‌ర్ రెగ్యులేష‌న్ క‌మిటీతో పాటు కావేరీ వాట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది. కావేరి నీటిని త‌మిళ‌నాడుకు విడుద‌ల చేయ‌డంపై క‌ర్ణాట‌క‌లోకి కొన్ని రాజ‌కీయ పార్టీల‌తో పాటు కన్నడ సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద నిర‌స‌న‌లు , ధర్నాలు నిర్వహించారు. మాండ్య‌లోని గురుశ్రీ థియేట‌ర్‌ను ముట్ట‌డించిన ఆందోళ‌న‌కారులు సీఎం విజ‌య్ పోస్ట‌ర్ల‌ను చించేశారు. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను అడ్డుకున్నారు.

స్క్రీనింగ్ ఆపేశారు...

ఆందోళ‌న‌కారుల నిర‌స‌న‌ల కార‌ణంగా జ‌న‌నాయ‌గ‌న్ సినిమా స్క్రీనింగ్‌ను థియేట‌ర్ యాజ‌మాన్యాలు నిలిపివేశాయి. జ‌న‌నాయ‌గ‌న్ పోస్ట‌ర్లు, క‌టౌట్ల‌ను తొల‌గించారు. ఈ ఆందోళ‌న‌లు త‌గ్గే వ‌ర‌కు జ‌న‌నాయ‌గ‌న్ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్లు...

జ‌న‌నాయ‌గ‌న్ సినిమాకు హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మ‌మితా బైజు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తెలుగు మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విజ‌య్ చివ‌రి మూవీ కావ‌డంతో టాక్‌తో సంబంధం లేకుండా క‌లెక్ష‌న్స్ మాత్రం భారీగా వ‌స్తోన్నాయి. వారం రోజుల్లోనే మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

 

Advertisement
Advertisement