Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ
Nishikant Dubey | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే (Nishikant Dubey) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చెప్పినదానికంతా తలాడిస్తున్నాడని.. ఏది చెప్పమంటే అదే చెబుతున్నారని మండిపడ్డారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు.
Nishikant Dubey | త్రినేత్ర.న్యూస్ : ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఓ క్రిమినల్ వేస్ట్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే (BJP MP Nishikant Dubey) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సీఎంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మంచి మనిషి అని ప్రశంసించారు. ఆయన తనకు పాత మిత్రుడని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద దుబే మీడియాతో మాట్లాడారు. గతంలో తామిద్దరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ABVP నేపథ్యం ఉండటంతో రేవంత్ రెడ్డి ఆలోచనా విధానం బాగుంటుందని కితాబిచ్చారు. అయితే, ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నందున రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నాడని.. ఏది చెప్పమంటే అదే చెబుతున్నారని మండిపడ్డారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. దుబే వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Delhi | On Telangana CM Revanth Reddy, BJP MP Nishikant Dubey says, "The Chief Minister of Telangana is a good man; he is a very old friend of mine. We both contributed significantly to the expansion of the Sangh Parivar and the Vidyarthi Parishad...Basically, since he… pic.twitter.com/xZHpijPp4h
— ANI (@ANI) July 31, 2026
Also Read..
విద్యార్థులను కించపరచడం సీఎం ఉద్దేశం కాదు.. డిగ్రీలు పూర్తయినా స్కిల్స్ ఉంటలేవనే ఆయన బాధ
తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్
- ●V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట
- ●Fake Number Plates | నకిలీ నంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. ఆరు క్రిమినల్ కేసులు.. వాహనాలు సీజ్
- ●Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజూ సూచీల జోరు..
- ●Jana Nayagan | కర్ణాటకలో జననాయగన్ స్క్రీనింగ్ నిలిపివేత - సీఎం దళపతి విజయ్ పోస్టర్లు చించేసిన ఆందోళనకారులు

Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్

V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట

Fake Number Plates | నకిలీ నంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. ఆరు క్రిమినల్ కేసులు.. వాహనాలు సీజ్

Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా






