Vande Bharat | వందేభారత్‌లో తొలిసారి గుండె తరలింపు
Vande Bharat | అత్యవసర వైద్య సేవల్లో మరో కీలక ముందడుగు పడింది. ఓ వ్యక్తి గుండెను ఒక నగరం నుంచి మరో నగరానికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారిగా విజయవంతంగా తరలించారు. సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు ముంబయి సెంట్రల్–గాంధీనగర్ క్యాపిటల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20901)లో గుండెను సురక్షితంగా తరలించారు.
- సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు రవాణా
- రెండున్నర గంటల్లోనే గమ్యస్థానానికి
Vande Bharat | అత్యవసర వైద్య సేవల్లో మరో కీలక ముందడుగు పడింది. ఓ వ్యక్తి గుండెను ఒక నగరం నుంచి మరో నగరానికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారిగా విజయవంతంగా తరలించారు. సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు ముంబయి సెంట్రల్–గాంధీనగర్ క్యాపిటల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20901)లో గుండెను సురక్షితంగా తరలించారు. నిర్ణీత సమయానికి రైలు రెండున్నర గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంది. సూరత్ నుంచి తరలించిన గుండెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. అక్కడ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం దీన్ని వినియోగించనున్నారు. గుండెను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి భద్రతతో ఆసుపత్రికి చేర్చడంతో మార్పిడి ప్రక్రియను సకాలంలో ప్రారంభించే అవకాశం లభించింది.
గ్రీన్ కారిడార్ ఏర్పాటు
గుండెను అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ మొదటి నంబర్ ప్లాట్‌ఫాం నుంచి యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్), గుజరాత్ పోలీసులు సమన్వయంతో గుండెను వేగంగా ఆసుపత్రికి చేర్చారు. దీంతో నిర్ణీత సమయానికే మార్పిడి ప్రక్రియను ప్రారంభించేందుకు వైద్యులకు అవకాశం లభించింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో భారతీయ రైల్వేలు, ఆర్‌పీఎఫ్, గుజరాత్ పోలీసులు, వైద్య బృందం మధ్య సమన్వయం కీలకంగా నిలిచింది. గుండె మార్పిడి వంటి అత్యవసర వైద్య సేవల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనదే. ఈ నేపథ్యంలో సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు వందేభారత్ ద్వారా గుండెను సురక్షితంగా, సకాలంలో తరలించడం గర్వకారణమని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సమయపాలన, విశ్వసనీయ సేవలు ఈ ప్రాణరక్షక ప్రయాణంలో కీలకంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో అవయవాలను వేగంగా తరలించేందుకు రైల్వే వ్యవస్థను సమర్థంగా వినియోగించవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఇప్పటివరకు ప్రయాణికులు, సరుకు రవాణాకే పరిమితమైన భారతీయ రైల్వేలు.. అత్యవసర వైద్య సేవల్లోనూ కీలక భాగస్వామిగా మారుతున్నాయనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేసింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన సమయంలో సహకరించడం కేవలం బాధ్యత మాత్రమే కాదని.. మానవత్వానికి అందించే సేవలో భాగమని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ
- ●CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
- ●Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు
- ●Web Series Review | అబ్జెక్షన్ మై లార్డ్ రివ్యూ - జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●TOMCOM | ఏటీసీల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సులు
- ●Chamala Kiran Kumar Reddy | విద్యార్థులను కించపరచడం సీఎం ఉద్దేశం కాదు.. డిగ్రీలు పూర్తయినా స్కిల్స్ ఉంటలేవనే ఆయన బాధ

Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి

Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు

Web Series Review | అబ్జెక్షన్ మై లార్డ్ రివ్యూ - జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?





